BREAKING
నల్ల పోచమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలకు సుఖసంతోషాలు కలగాలి: కూన శ్రీశైలం గౌడ్ మహేష్ బాబు వారణాసి చిత్రం తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో? టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన చర్చ నవంబర్ 1 నుంచి గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా శుద్ధి చేసిన నీటి సరఫరా పురపాలక ఎన్నికల పోలింగ్‌కు1100 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు . జర్నలిస్ట్ కాలనీలో వైభవంగా సంకటహర చతుర్థి పూజలు రైతుబజార్‌లో బాలకార్మికుడి గుర్తింపు వరద బాధితులకు ఆపన్నహస్తం సమస్యల పరిష్కారానికి నన్ను గెలిపించండి విశాఖను ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రగా తీర్చిదిద్దుతా వంశధార వరద బాధితులకు అండగా ఉంటాం.. ఎవరూ అధైర్యపడవద్దు! చింతల్ దర్గా షరీఫ్ ఉర్స్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కూటమిని ఓడించేందుకు ఓటుతో తిరగబడండి రామ్ చరణ్, సుకుమార్ ఆర్సీ 17 మూవీపై క్రేజీ అప్‌డేట్స్.. షూటింగ్ ఎప్పుడంటే? వార్డు మెంబర్ల హక్కులు కల్పించాలి వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

మచిలీపట్నంలో అర్ధరాత్రి కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

Select Suryaa Now
మచిలీపట్నంలో అర్ధరాత్రి కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

మచిలీపట్నం మేజర్ న్యూస్ : అర్నాబ్ తుఫాను ప్రభావంతో ఈదురుగాలులు, వర్షాలకు దెబ్బతిన్న విద్యుత్ సరఫరాను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం అర్ధరాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించి విద్యుత్ పునరుద్ధరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గాంధీనగర్, ఇంగ్లీష్ పాలెం, బస్టాండ్ వెనుక గానుగ సెంటర్, చింత చెట్టు సెంటర్, కాలేఖాన్ పేట, బలరాముని పేట, కాసాని గూడెం, పాత హౌసింగ్ బోర్డు కాలనీల్లో పర్యటించి పనుల పురోగతిని సమీక్షించారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో జరుగుతున్న జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా వీలైనంత త్వరగా సరఫరాను పునరుద్ధరించాలని, క్షేత్రస్థాయిలో సిబ్బందిని సమర్థవంతంగా వినియోగించుకుని పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి, దెబ్బతిన్న విద్యుత్ లైన్లు, ఇతర వ్యవస్థల మరమ్మతులను నిరంతరం పర్యవేక్షిస్తూ సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని స్పష్టం చేశారు. సరఫరా పునరుద్ధరణ పనుల పర్యవేక్షణకు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి శుక్రవారం ఉదయం కృష్ణా జిల్లాకు చేరుకున్నారు. గూడూరు వద్ద జిల్లా కలెక్టర్ డీకే బాలాజిని మర్యాదపూర్వకంగా కలిశారు. తుఫాను కారణంగా దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ పనుల పురోగతి, చేపడుతున్న చర్యలపై ఇరువురు చర్చించారు. విద్యుత్ సరఫరాను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం, కృష్ణాజిల్లా.