లక్ష్మీదేవి విజయానికి పార్టీ శ్రేణులంతా సమిష్టిగా పనిచేయాలి..
- ధర్మాన కృష్ణదాస్
శ్రీకాకుళం, నవంబర్ 16 మేజర్ న్యూస్:
శ్రీకాకుళం నగర మేయర్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుండ లక్ష్మీదేవి విజయమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేయాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు.
శ్రీకాకుళం మేయర్ అభ్యర్థిగా గుండ లక్ష్మీదేవి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం సోమవారం జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, రీజినల్ కోఆర్డినేటర్, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, జిల్లా పరిశీలకుడు, ఎమ్మెల్సీ కుంబా రవిబాబును కలిసి వారి ఆశీస్సులు తీసుకున్నారు.
అనంతరం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. శ్రీకాకుళం మేయర్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గుండ లక్ష్మీదేవికి మద్దతుగా నిలవాలని కోరారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఆమెను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు వ్యక్తిగత విభేదాలకు తావులేకుండా సమన్వయంతో పనిచేయాలని, క్షేత్రస్థాయిలో ప్రజలను కలుస్తూ పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. అందరి సమిష్టి కృషి, ఐక్యతతో ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించగలమని ధర్మాన కృష్ణదాస్ ఆశాభావం వ్యక్తం చేశారు.