BREAKING
అడవి ఆముదం గింజలు తిని 10 మంది విద్యార్థులు అస్వస్థత.. ఒకరి పరిస్థితి విషమం MLC మీర్జా రహమత్ బేగ్ బ్లాక్‌మెయిల్ కేసులో కీలక పరిణామం.. సల్మాన్ ఖాన్ అరెస్ట్, రిమాండ్ పంచాయతీ ఎన్నికలకు కూటమి సంసిద్ధం గెలుపు లక్ష్యంగా నాయకులకు దిశా నిర్దేశం - ఎమ్మెల్యే ముత్తుముల పూతలపట్టులో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు అట్టహాసంగా 'అష్టదిగ్గజాలు' కవి సమ్మేళనం ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎంపీ భాష్యం రామకృష్ణ ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత కేంద్రాలకు తరలించాలి: పవన్ కళ్యాణ్ అమరుల స్ఫూర్తితో.. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ప్రముఖ మలయాళ గాయని రిమి టోమి రెండో వివాహం, జిమ్ ట్రైనర్ లిబిన్ మాత్యుతో వైభవంగా పెళ్లి ఇంకొల్లు మండలంలో చివరి రోజు సర్పంచ్‌, వార్డు సభ్యులకు 228 నామినేషన్లు దాఖలు ఈనెల 20న, 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం కోలాహలంగా రాచానుపల్లి వైసీపీ మద్దతు దారుడు, సర్పంచ్ అభ్యర్థి బండ అంజి యాదవ్ నామినేషన్ ఇంట్లోనే మద్యం దుకాణమా.. ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యమా? అంధకారంలో పూతలపట్టు మండలంలోని వైఎస్ఆర్ కాలనీలు వీధి దీపాలు లేక ప్రజల నరకయాతన చీకట్లో విషపురుగుల భయం.. పట్టించుకోని అధికారులు పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే కవ్వంపల్లి విద్యార్థినికి ఎమ్మెల్యే సన్మానం

లాగోస్ లో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం, 200 మందికి పైగా భక్తుల హాజరు

Select Suryaa Now
లాగోస్ లో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం, 200 మందికి పైగా భక్తుల హాజరు

ఒంగోలు, మేజర్‌న్యూస్‌ :

నైజీరియాలోని లాగోస్ నగరం, ఇలుపేజు ప్రాంతంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నవంబర్ 15, ఆదివారం నాడు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి కథ, పూజ ఘనంగా నిర్వహించారు. తెలుగు టెంపుల్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా భక్తులు ఎంతో ఉత్సాహంగా, భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

పవిత్ర కార్తీకమాసంలో అనేక తెలుగు కుటుంబాలు శ్రీమహావిష్ణువు రూపమైన సత్యనారాయణ స్వామిని పూజిస్తాయి. నైజీరియాలోని తెలుగు సమాజం నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి స్థానిక కుటుంబాలు చేరుకుని, భక్తిశ్రద్ధలతో సామూహిక పూజ చేశాయి. ఆలయ ప్రధాన అర్చకులు నారాయణం మురళీమోహనకృష్ణ భట్టర్ పూజను నిర్వహించారు. ప్రతి దశలోనూ భక్తులందరికీ మార్గదర్శనం చేశారు. ప్రతి ఆచారాన్ని సులభమైన మాటల్లో వివరించారు. దీనివల్ల అందరూ సత్యనారాయణ స్వామి వ్రత ప్రాముఖ్యతను అర్థం చేసుకుని పూజలో పాల్గొనగలిగారు. వ్రతం, పూజ అనంతరం మహా దీపారాధన చేశారు. తరువాత భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ఆలయ చైర్‌పర్సన్ పి.ఎస్. బాలు, వైస్ చైర్‌పర్సన్ శ్రీనివాస్ పిల్ల, ఆర్గనైజింగ్ సెక్రటరీ శిరీష యోగానంద్, ఫైనాన్స్ సెక్రటరీ నారా వెంకట కృష్ణ, ప్రమోద్ ఈ కార్యక్రమాన్ని ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తుల కోసం అన్ని ఏర్పాట్లను చూసుకున్నారు. రాజేష్ బాబు నందం, నాగవేణి అవ్వారు, పి. రామకృష్ణ, దావులూరు కిరణ్ కుమార్, శైలజ, రామాంజనేయులు చేరిపల్లి, కల్పనా చేరిపల్లి, సుధీర్ త్రిపురారి, ఈశ్వరి త్రిపురారి మరెందరో భక్తులు పాల్గొన్నారు.

హిందూ మందిర్ ఫౌండేషన్ సహకారంతో.. ఇదే దేవాలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు కూడా గతనెలలో జరిగాయి. విజయదశమి ప్రత్యేక పూజలు, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతానికి హాజరైన భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇంటికి వేలకిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ.. తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను బలంగా కాపాడుకోవటానికి, ఇతర తెలుగు కుటుంబాలతో సంబంధాలను పెంపొందించుకోవటానికి ఈ పండుగలు అవకాశం కల్పిస్తున్నాయని చెప్పారు. అందరూ కలిసి పూజ చేయడం తమ ఐక్యతను చాటడంతోపాటు, లాగోస్ తెలుగు సమాజం ప్రశాంతంగా జీవించేందుకు ఉపయోగపడుతోందని చెప్పారు.