క్యాన్సర్ పై అవగాహన
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంరామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో నవంబర్ సోమవారం సీతానగరం మండలం లంకూరు గ్రామంలోని కస్తూరిబా గాంధీ ఆశ్రమంలో ప్రత్యేక ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయానందజీ మహారాజ్ తెలిపారు.ఈ వైద్య శిబిరంలో డాక్టర్ యన్నమని రామచంద్రరావు, డాక్టర్ కాదా నాగేంద్ర ప్రసాదరావు, డాక్టర్ సత్యం రమేష్ బాబు వైద్య సేవలు అందించారు. సుమారు 200 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సలహాలు అందించారు. వీరిలో 84 మందికి రక్త పరీక్షలు, ఆరుగురికి థైరాయిడ్ పరీక్షలు, నలుగురికి ఈసీజీ పరీక్షలు నిర్వహించారు.వేమగిరికి చెందిన పరమహంస యోగానంద నేత్రాలయం వైద్య బృందం సుమారు 28 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నేత్రాలయం ప్రోగ్రాం మేనేజర్ నక్కా చంటిబాబు, సిబ్బంది పాల్గొన్నారు.