పాఠశాలల్లో అల్పాహారం ప్రారంభం
*--వారానికి ఆరు రోజులు అమలు.*
*--ఎల్‌నినోపై విద్యార్థులకు అవగాహన*
నవాబుపేట సూర్య న్యూస్: మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం నుంచి విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమం ప్రారంభమైంది.ఈ విషయాన్ని మండల విద్యాధికారి నాగ్య నాయక్ వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులు ఖాళీ కడుపుతో పాఠశాలలకు రాకుండా,వారికి పౌష్టికాహారం అందించడంతో పాటు హాజరు శాతం,చదువుపై ఏకాగ్రత పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.మండలంలోని 52ప్రాథమిక పాఠశాలలు,7ప్రాథమికోన్నత పాఠశాలలు,9ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వారానికి ఆరు రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం వేడివేడి అల్పాహారం అందించనున్నట్లు పేర్కొన్నారు.ఇందులో భాగంగా మిల్లెట్ ఇడ్లీ,పూరి,దోశ,ఉప్మా, బోండా వంటి అల్పాహారంతో పాటు పాలు లేదా రాగిజావను రోజువారీ మార్పులతో అందించనున్నట్లు వివరించారు.విద్యార్థుల ఆరోగ్యం,విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.*అనంతరం ఎల్‌నినో ప్రభావంపై అవగాహన* అల్పాహార కార్యక్రమం అనంతరం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంఈఓ నాగ్య నాయక్ మాట్లాడుతూ..ఎల్‌నినో కారణంగా వాతావరణంలో చోటుచేసుకునే మార్పులు,వర్షపాతంపై దాని ప్రభావం,వ్యవసాయం తదితర రంగాలపై కలిగే పరిణామాల గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది.వాతావరణ మార్పులపై అవగాహన కలిగి ఉండాలని,పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు,ప్రజాప్రతినిధులు,నాయకులు,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.