BREAKING
జనసేన కార్పొరేటర్ బాయన రాణి ఘన విజయం కార్పొరేటర్ కాకి గంగరాజు ఘనవిజయం పకడ్బందీగా భూముల రీ సర్వే… -కలెక్టర్ హైమావతి -వీరపూర్ లో భూ రీసర్వే పరిశీలించిన కలెక్టర్.. 19గ్రామాల్లో పోటీచేసే అభ్యర్థులు హారహోరి ప్రచారాలతో పండుగ వాతావరం అనంతవరం గ్రామంలో కమలం హోరు వివాదాలకు చెక్ పెడతాను: ఇకపై మాట్లాడే విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటానన్న సాయి పల్లవి పద్మనాభంలో కూటమి జైత్రయాత్ర బోని లో పసుపు జాతర.. తాట్రాజు అప్పారావు భారీ ర్యాలీకి బ్రహ్మరథం ఆర్థిక సహాయం ఓటీటీని షేక్ చేస్తున్న మనోజ్ బాజ్ పాయ్ క్రైమ్ థ్రిల్లర్ గజబ్ రాత్: నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్ రాజయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం పలమనేరు మున్సిపాలిటీపై టీడీపీ జెండా చైర్మన్‌గా రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి గౌడ్ విజయం జై భీమ్ మరువలేని నటి లిజోమోల్ జోస్: బత్తా చిత్రంతో మరోసారి భావోద్వేగాలతో కట్టిపడేస్తున్న టాలెంటెడ్ నటి తీవ్ర తుపానుగా ‘మురసు’ బీభత్సం: రేపూ ఏపీలో కొనసాగనున్న భారీ వర్షాలు! ఇన్నోవేషన్ పవర్‌హౌస్‌గా భారత్: 38వ స్థానానికి చేరిక

స్థానిక ఎన్నికల్లో టీడీపీకి బుద్ది చెప్పాలి * ఫ్యాన్ గుర్తుకే ఓటెయ్యండి *

Select Suryaa Now
స్థానిక ఎన్నికల్లో టీడీపీకి బుద్ది చెప్పాలి  * ఫ్యాన్ గుర్తుకే ఓటెయ్యండి *

పాచిపెంట, సూర్య :  స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని, వైయస్సార్ పార్టీ అభ్యర్థులకు అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని వైయస్సార్ పార్టీ ఎంపీపీ అభ్యర్థి డోల బాబ్జి ప్రజలను కోరారు. సోమవారం పాచిపెంట మండలంలో పణుకువలస ఎంపీటీసీ సెగ్మెంట్ పరిధిలోగల పెద్ద చీపురు వలస, చిన్న చీపురు వలస, చెరుకుపల్లి, అలాగే మోసూరు ఎంపీటీసీ సెగ్మెంట్ అభ్యర్థి గండిపల్లి రాముని, జెడ్పిటిసి అభ్యర్థి కలువలపల్లి పుష్పలను ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రచార కార్యక్రమంలో వైసీపీ నాయకులకు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అభ్యర్థులకు భ్రహ్మ రదం పట్టారు. ఎక్కడ చూసినా వైసిపి అభిమానులు వేలాదిమంది పాల్గొని సభలు, సమావేశాలు, ప్రచార కార్యక్రమాలను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా బాబ్జి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను గురించి ప్రజలకు వివరించారు. వైయస్సార్ పార్టీ ప్రభుత్వం హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వైయస్సార్ చేయూత, ఇంటింటికి రేషన్ బియ్యము పంపిణీ పథకం, తదితర పథకాల గురించి ప్రజలకు గుర్తు చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఓటు వేస్తే నష్టపోయేది మనమేనని అందుకే వైయస్సార్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. ఎంపీపీగా నన్ను గెలిపిస్తే అంటే 14 మంది ఎంపీటీసీలు గెలిపించి అవకాశం ఇస్తే మండల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న అబద్ధపు హామీలు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, నమ్మి మోసపోవద్దని, ఈసారి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని కోరారు. జడ్పిటిసి కి ఒక ఓటు, స్థానిక ఎంపీటీసీ అభ్యర్థికి ఒక ఓటు వేసి గెలిపించాలని కోరారు. మీ ప్రాంతాల్లో సమస్యలు మీకు ఎదురైతే వెంటనే తనకు గాని నాకు గాని తెలియజేయాలని కోరారు. ఆయన వెంట మాజీ వైస్ ఎంపీపీ టీ గౌరీష్, రాయి గుడ్డి వలస మాజీ సర్పంచ్ చింత సీతయ్య, కొల్లి కొత్తయ్య, నాయకులు వైయస్సార్ పార్టీ అభిమానులు ప్రజలు పాల్గొన్నారు.