BREAKING
చిత్తూరులో టీడీపీ జయభేరి: 35,050 ఓట్ల భారీ మెజార్టీతో మేయర్ పీఠం కైవసం పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి జిన్నారం సీఐ నాగార్జున గౌడ్ 35వ వార్డులో ఉత్కంఠకు తెర.. రీ కౌంటింగ్‌లో జనసేన అభ్యర్థి విజయం.!.. రైతులకు మద్దతు ధర అందేలా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి : కలెక్టర్ 30 ట్రిలియన్ యూరోల నిధుల కొరత ఏర్పడుతుందని హెచ్చరించిన నివేదిక ఇంటెసా సానిపాల్డో ప్రకటన.. మోంటె డి పాశ్చి ఒప్పందం కొలిక్కి వచ్చాక మెడియోబంకాపై బైఅవుట్ ఆఫర్ ఫేక్ జాబ్ ఇంటర్వ్యూల ద్వారా బైనాన్స్ హ్యాకింగ్..డిజిటల్ వాలెట్లపై సైబర్ నేరగాళ్ల పంజా అమెరికా ఎన్నికల కేసుల్లో ట్రంప్ యంత్రాంగానికి ఎదురుదెబ్బ కమ్యూనిస్ట్ పాలనలో సీక్రెట్ పోలీసుల ఒత్తిడి..రిక్రూట్‌మెంట్‌ను తిరస్కరించిన హంగేరి మాజీ ప్రధాని ఓర్బన్ కేసీఆర్ ను కలిసిన బీఆర్ఎస్ నేతలు కంబదూర్ వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో రోడ్ షో. బ్రిటన్-ఈయూ యువత చలనశీలత ఒప్పందం ఎమ్మిగనూరు మున్సిపల్ కూటమి కైవాసం పకడ్బందీగా భూముల రీ సర్వే.. -కలెక్టర్ హైమావతి -వీరపూర్ లో భూ రీ సర్వే పరిశీలించి కలెక్టర్ డీఎస్పీ చేతుల మీదుగా భీమా చెక్కుల పంపిణీ

ఉద్యోగులు విధి నిర్వహణతో పాటు తమ ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.

Select Suryaa Now
ఉద్యోగులు విధి నిర్వహణతో పాటు తమ ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి : కలెక్టరేట్లో, ఉద్యోగుల కోసం  జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కలెక్టరేట్లోని అధికారులు, ఉద్యోగులంతా వైద్య శిబిరంలో ఉచితంగా రక్త పరీక్షలు చేసుకునేలా చూడాలన్నారు. మనకు తెలియకుండానే మనలోపల ఎన్నో అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉందని, ముందుగానే పరీక్షలు చేసుకొని అనారోగ్య సమస్యలు తెలుసుకోవడం ద్వారా ఎంతో మేలు ఉంటుందన్నారు. తగిన మందులు, జాగ్రత్తలు, జీవనశైలిలో మార్పుల ద్వారా మంచి ఆరోగ్యకర జీవితాన్ని పొందవచ్చునని చెప్పారు. ఎవరూ తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదని వివరించారు. ప్రతి రోజు శారీరక వ్యాయామాలు, యోగా చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు.కలెక్టరేట్ ఉద్యోగులంతా రక్త పరీక్షలు పూర్తి చేసుకునే వరకు వైద్య శిబిరం కొనసాగించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి రాజేందర్, అధికారులు సౌమ్య, సిబ్బంది, తదితరులు ఉన్నారు.