BREAKING
పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి జిన్నారం సీఐ నాగార్జున గౌడ్ 35వ వార్డులో ఉత్కంఠకు తెర.. రీ కౌంటింగ్‌లో జనసేన అభ్యర్థి విజయం.!.. రైతులకు మద్దతు ధర అందేలా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి : కలెక్టర్ 30 ట్రిలియన్ యూరోల నిధుల కొరత ఏర్పడుతుందని హెచ్చరించిన నివేదిక ఇంటెసా సానిపాల్డో ప్రకటన.. మోంటె డి పాశ్చి ఒప్పందం కొలిక్కి వచ్చాక మెడియోబంకాపై బైఅవుట్ ఆఫర్ ఫేక్ జాబ్ ఇంటర్వ్యూల ద్వారా బైనాన్స్ హ్యాకింగ్..డిజిటల్ వాలెట్లపై సైబర్ నేరగాళ్ల పంజా అమెరికా ఎన్నికల కేసుల్లో ట్రంప్ యంత్రాంగానికి ఎదురుదెబ్బ కమ్యూనిస్ట్ పాలనలో సీక్రెట్ పోలీసుల ఒత్తిడి..రిక్రూట్‌మెంట్‌ను తిరస్కరించిన హంగేరి మాజీ ప్రధాని ఓర్బన్ కేసీఆర్ ను కలిసిన బీఆర్ఎస్ నేతలు కంబదూర్ వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో రోడ్ షో. బ్రిటన్-ఈయూ యువత చలనశీలత ఒప్పందం ఎమ్మిగనూరు మున్సిపల్ కూటమి కైవాసం పకడ్బందీగా భూముల రీ సర్వే.. -కలెక్టర్ హైమావతి -వీరపూర్ లో భూ రీ సర్వే పరిశీలించి కలెక్టర్ డీఎస్పీ చేతుల మీదుగా భీమా చెక్కుల పంపిణీ చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి : కలెక్టర్

సింగరేణి పెన్షనర్లకు సౌకర్యవంతంగా డీఎల్‌సీ రెన్యూవల్ సేవలు - తొలిరోజు 185 మందికి సేవలు

Select Suryaa Now
సింగరేణి పెన్షనర్లకు సౌకర్యవంతంగా డీఎల్‌సీ రెన్యూవల్ సేవలు - తొలిరోజు 185 మందికి సేవలు
సూర్య, మందమర్రి : సింగరేణి మాజీ ఉద్యోగులు, పెన్షనర్లు తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను సులభంగా పునరుద్ధరించుకునేందుకు మందమర్రి ఏరియాలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పెన్షనర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సింగరేణి యాజమాన్యం, సీఎంపీఎఫ్ కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్యాంపును సోమవారం సీఈఆర్ క్లబ్‌లో ప్రారంభించారు. ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమానికి తొలిరోజే పెన్షనర్ల నుంచి మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి డీజీఎం (పర్సనల్) సీహెచ్. అశోక్, సీఎంపీఎఫ్ కమిషనర్ గోవర్ధన్, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ శైలేంద్ర సత్యనారాయణ, భీమనాధుని సుదర్శన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పెన్షనర్లు తమ జీవిత ధ్రువీకరణ పత్రాలను సకాలంలో రెన్యూవల్ చేసుకోవడంతో పాటు, డిజిటల్ విధానంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకునేందుకు ఈ శిబిరం ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎంపీఎఫ్ కమిషనర్ గోవర్ధన్ మాట్లాడుతూ, పెన్షనర్లు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఆన్‌లైన్‌లోనే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను పునరుద్ధరించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అదే సమయంలో సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీఎంపీఎఫ్ కార్యాలయం నుంచి ఓటీపీలు పంపించడం లేదా వాయిస్ కాల్స్ చేయడం జరగదని స్పష్టం చేశారు. ఈ పేరుతో ఎవరైనా ఫోన్ చేసి వివరాలు అడిగితే స్పందించవద్దని, వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులకు అందించవద్దని పెన్షనర్లకు సూచించారు. క్యాంపు తొలిరోజు గోదావరిఖని సీఎంపీఎఫ్ కార్యాలయ సిబ్బంది, మందమర్రి ఏటిబీ సెల్ సిబ్బంది సమన్వయంతో 185 మంది పెన్షనర్ల డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను విజయవంతంగా రెన్యూవల్ చేశారు. పెన్షనర్లకు ఒకే చోట సేవలు అందించడంతో సమయం, శ్రమ ఆదా కానున్నాయి. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీఈఆర్ క్లబ్‌లో ప్రత్యేక క్యాంపు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. పెన్షనర్లు తమ వెంట పీపీఓ కాపీ, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్, పాన్ కార్డు జిరాక్స్ ప్రతులతో పాటు ఆధార్‌తో అనుసంధానమైన యాక్టివ్ మొబైల్ ఫోన్‌ను తప్పనిసరిగా తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పీఓ (ఏటిబీ సెల్) సత్యనారాయణ, జీఎం కార్యాలయ ఏటిబీ సెల్ సిబ్బంది, సీఎంపీఎఫ్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.