telangana
మంగి గ్రామానికి బస్సు సేవలు ప్రారంభం - గ్రామస్తుల హర్షం
సూర్య తిర్యాణి : తిర్యాణి మండలం మంగి గ్రామ ప్రజల రవాణా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గ్రామస్తులు, గ్రామ సర్పంచులు రాయిసిడం వినోద్ కుమార్ కూడ్మేత హనుమంత్,ఉప సర్పంచులు కనక శ్రీకాంత్, అర్కామల్లేష్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ప్రత్యేక చొరవ తీసుకుని రోడ్డు మరమ్మతులు చేయించడంతో పాటు గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించేలా కృషి చేశారు.రోడ్డు మరమ్మతులు పూర్తికావడంతో ఈరోజు మంగి గ్రామానికి బస్సు సేవలను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ, తమ సమస్యను గుర్తించి వెంటనే స్పందించి బస్సు సౌకర్యం కల్పించిన మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మంగి గ్రామ సర్పంచ్ రాయిసిడాం వినోద్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు తనయుడు, వినోద్ సర్పంచ్
హన్మంత్రావు, కాతిలే మంజుల మధుకర్,సర్పంచ్ దేవుబాయి కాశిరామ్ తిర్యాణి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు తుమ్రం గోపాల్ తదితరులు పాల్గొన్నారు.గ్రామ ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కారం కోసం కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.