క్రీడా పోటీల్లో వాగ్దేవి విద్యార్థుల ప్రతిభ
నరసరావుపేట మేజర్ న్యూస్ :
పల్నాడు జిల్లా స్థాయి జూనియర్ ఆట్యా-పాట్యా, సబ్ జూనియర్ కబడ్డీ పోటీల్లో వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారని ప్రిన్సిపాల్ ఓగూరి నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబరు 26న నెకరికల్లులో నిర్వహించిన ఆట్యా-పాట్యా పోటీల్లో యర్రంశెట్టి నిఖిల్, అక్టోబరు 3న నరసరావుపేటలో జరిగిన కబడ్డీ పోటీల్లో రాగిశెట్టి నాగరాజు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ ఓగూరి నాగేశ్వరరావు తెలిపారు. ప్రతిభ చాటిన విద్యార్థులను కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు అభినందించారు. డైరెక్టర్లు కాట్ల రామకోటేశ్వరరావు, కపిలవాయి రాజేంద్రప్రసాద్, పాశం కృష్ణారావు, పి.వి. అచ్యుతరావు, ఫిజికల్ డైరెక్టర్ రాయల ఆంజనేయులు విద్యార్థులను అభినందించారు.
రిపోర్టర్ మల్లికార్జున్