క్రైస్తవ ఆత్మీయ సమావేశం లో పాల్గొన్న కె.కె రాజు, మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి
సీతమ్మధార, సూర్య : విశాఖ ఉత్తర నియోజకవర్గం మాధవధార మిలన్ ఫంక్షన్ హాల్ లో పాస్టర్ విక్టర్ పాల్ ఆధ్వర్యంలో జరిగిన గ్రేటర్ విశాఖ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవీఎంసీ మేయర్ అభ్యర్ది వరుదు కల్యాణి కి,వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు కె.కె రాజు ,వైసీపీ మేయర్ అభ్యర్థి వరుదు కల్యాణి పాల్గొని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాన్ వెస్లీ ,రవిరాజు, పిల్లా వెంకటలక్ష్మి, 60 వార్డు కార్పొరేటర్ అభ్యర్థి సారంగదరుడు, క్రైస్తవ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.