రూ.2.40 కోట్లతో తూర్పు కోడిగుడ్లపాడు - జంగాలపల్లి తారు రోడ్డు నిర్మాణం
పామూరు, మేజర్ న్యూస్ :
కూటమి ప్రభుత్వంతోనే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి సాధ్యమని కనిగిరి ఏఎంసీ మాజీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు బైరెడ్డి జయరామిరెడ్డి పేర్కొన్నారు. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సహాయ సహకారాలతో పామూరు ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి తూర్పు కోడిగుడ్లపాడు మీదుగా జంగాలపల్లి వరకు రూ.2.40 కోట్ల నిధులతో తారు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం నిర్వహించిన రోడ్డు నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి విశేష కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే ఆయా గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని అన్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో ఎస్‌సీ, డీఈ ప్రకాష్‌రెడ్డి, ఏఈ, టీడీపీ నాయకులు తిరివీధి జనార్దన్ రావు, దారపనేని రాజేంద్రప్రసాద్, మిరియం సుబ్బరాయుడు, కాంట్రాక్టర్ గాజులపల్లి వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.