BREAKING
నాణ్యమైన కంప్యూటర్ కోర్సులతో బంగారు భవిష్యత్తు యువతిని వేధిస్తున్న యువకుడు పై కేసు నమోదు. కంబదూరులో యువకుడి ఆత్మహత్య జనసేన నాయకుడు భీమ రాయుడు కుమారుడు మృతి.. కుటుంబంలో విషాదం మూడు పదవుల ముచ్చటేనా.. బాధ్యతల సంగతేంటి? బొడ్డు వెంకటరమణ కు మూడు కీలక పదవు లపై టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖన, వ్యక్తిత్వ పోటీలు తైలాభిషేకాలతో శనేశ్వరాలయం…దర్శనానికి పోటెత్తిన భక్తులుస్వా మివారికి రూ.5.16 లక్షల ఆదాయం ప్లాస్టిక్ నివారణకు ప్రతి ఇంటికీ ఒక జూట్ సంచి పంపిణీ చేయాలి.. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు.. పుష్కరాల నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలి : దేవస్థాన అభివృద్ధి పనులపై దేవాదాయశాఖ కమిషనర్ సమీక్ష కాంట్రాక్ట్ నర్సుల నిరసన దీక్ష.... వైఎస్సార్‌సీపీ నాయకుడు శ్రీకాంత్ సంఘీభావం.. స్థానిక ఎన్నికలకు సమాయత్తం అవ్వండి జిల్లా వైయస్సార్సీపి అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పిలుపు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే గిడ్డి రావులపాలెం, వాడపల్లి ఏటిగట్టు రహదారి విస్తరణ, నిర్మాణానికి రూ.19 కోట్లు కేటాయించాలని కోరిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే సత్యానందరావు రావులపాలెం - పలివెల రహదారి అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు మంజూరు: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వెల్లడి! అమలాపురం పార్లమెంట్ సమన్వయకర్తగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మోడీ ప్రజాస్వామ్యానికే ప్రమాదకారి: సిఐటియు నాయకుడు ఎస్. భగత్

కంబదూరులో యువకుడి ఆత్మహత్య జనసేన నాయకుడు భీమ రాయుడు కుమారుడు మృతి.. కుటుంబంలో విషాదం

Select Suryaa Now
కంబదూరులో యువకుడి ఆత్మహత్య  జనసేన నాయకుడు భీమ రాయుడు కుమారుడు మృతి.. కుటుంబంలో విషాదం

కళ్యాణదుర్గం ఇన్చార్జ్ : మండల కేంద్రం కంబదూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. భరత్ అనే యువకుడు తన సొంత ఇంటి రెండో అంతస్తులో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

యువకుడు మృతి చెందిన విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. భరత్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మృతుడు భరత్ తండ్రి భీమ రాయుడు కంబదూరు మండల జనసేన నాయకుడిగా ఉన్నారు. అయితే భరత్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

రిపోర్టర్ : సుధా మోహన్, కళ్యాణదుర్గం ఇన్చార్జ్, కళ్యాణదుర్గం.