యువతిని వేధిస్తున్న యువకుడు పై కేసు నమోదు.
యువతిని వేధిస్తున్న యువకుడు పై కేసు నమోదు.
దుమ్ముగూడెం సూర్య న్యూస్ (కల్లూరి సుమన్)::ఒక యువతిని వేధిస్తున్న గౌరవరం యువకుడు పై దుమ్ముగూడెం పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు.ఈ కేసు పై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పైడాకులమడుగు గ్రామానికి చెందిన యువతి, గౌరవరం గ్రామానికి చెందిన కోడిరెక్కల జాన్ పాల్ ఇరువురు గత కొంతకాలంగా చనువుగా ఉన్నారు ఆ సమయంలో వారు తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానంటూ యువకుడు బెదిరించడంతో యువతి వారి కుటుంబ సభ్యుల తెలిపి బెదిరింపులు గురి చేస్తున్నట్లు పోలీస్స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు ఎస్సై శ్యాంప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్ చేస్తున్నట్లు తెలిపారు.