BREAKING
ఎఫ్-35 విమానం దగ్గరకు కూడా రానివ్వరు.. కానీ అమ్ముతామంటారా?: అమెరికా కమాండర్ సమక్షంలో ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ సూటి వ్యాఖ్యలు! 10 రోజుల్లో 1TB డేటా అప్‌లోడ్ చేసిన కాఫీ మెషిన్.. బిత్తరపోయిన టెక్కీ:'అసలేం అప్‌లోడ్ చేస్తోందబ్బా?' అంటూ పోస్ట్ వైరల్! దసరా 2026 వేళ బెంగళూరు గాంధీ బజార్‌లో బొమ్మల కొలువు సందడి: అందుగులలో అంబారాన్నంటిన బతుకమ్మ సంబురాలు కోలాహలంగా బతుకమ్మ సంబరాలు నాణ్యమైన కంప్యూటర్ కోర్సులతో బంగారు భవిష్యత్తు యువతిని వేధిస్తున్న యువకుడు పై కేసు నమోదు. కంబదూరులో యువకుడి ఆత్మహత్య జనసేన నాయకుడు భీమ రాయుడు కుమారుడు మృతి.. కుటుంబంలో విషాదం మూడు పదవుల ముచ్చటేనా.. బాధ్యతల సంగతేంటి? బొడ్డు వెంకటరమణ కు మూడు కీలక పదవు లపై టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖన, వ్యక్తిత్వ పోటీలు తైలాభిషేకాలతో శనేశ్వరాలయం…దర్శనానికి పోటెత్తిన భక్తులుస్వా మివారికి రూ.5.16 లక్షల ఆదాయం ప్లాస్టిక్ నివారణకు ప్రతి ఇంటికీ ఒక జూట్ సంచి పంపిణీ చేయాలి.. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు.. పుష్కరాల నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలి : దేవస్థాన అభివృద్ధి పనులపై దేవాదాయశాఖ కమిషనర్ సమీక్ష కాంట్రాక్ట్ నర్సుల నిరసన దీక్ష.... వైఎస్సార్‌సీపీ నాయకుడు శ్రీకాంత్ సంఘీభావం.. స్థానిక ఎన్నికలకు సమాయత్తం అవ్వండి జిల్లా వైయస్సార్సీపి అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పిలుపు.

నాణ్యమైన కంప్యూటర్ కోర్సులతో బంగారు భవిష్యత్తు

Select Suryaa Now
నాణ్యమైన కంప్యూటర్ కోర్సులతో బంగారు భవిష్యత్తు


- ఏపి శాసనమండలి సభ్యులు దళవాయి రమాదేవి వెల్లడి
- శ్రీ గుడ్ విల్ కంప్యూటర్స్ నందు శిక్షణ బాగుందని ప్రశంసలు
మదనపల్లె : నాణ్యమైన కంప్యూటర్ కోర్సులతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని ఏపి శాసనమండలి ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి పేర్కొన్నారు.శనివారం తనభర్త వెంకటనారాయణతో కలిసి మదనపల్లి పట్టణంలో ఆమె పర్యటించారు.ఈ నేపథ్యంలో సొసైటీ కాలనీలోని శ్రీ గుడ్ విల్ కంప్యూటర్స్ మేనేజింగ్ డైరెక్టర్ చల్లా అజయ్ కుమార్ ఆహ్వానం మేరకు ఇనిస్టిట్యూట్ ని సందర్శించారు.ఇందులో భాగంగా శ్రీ గుడ్ విల్ కంప్యూటర్స్ నందు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న కోర్సులు,కల్పిస్తున్న సౌకర్యాలను ఎమ్మెల్సీకి అజయ్ కుమార్ వివరించగా ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి మాట్లాడుతూ నాణ్యమైన కంప్యూటర్ కోర్సులను పూర్తిచేస్తే మెరుగైన ఉపాధి,ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు.శ్రీ గుడ్విల్ కంప్యూటర్స్ నందు అత్యుత్తమ శిక్షణ అందిస్తున్నారని ప్రశంసించారు.విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారని కొనియాడారు.ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్రంలో అక్షరాస్యత శాతం గణనీయంగా పెరుగుతోందన్నారు.అనంతరం అజయ్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి తమ ఇనిస్టిట్యూట్ ని సందర్శించి సూచనలు,సలహాలు అందజేయడం ఆనందంగా ఉందన్నారు.రాజకీయాలలో నిస్వార్ధమైన మహిళ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారని,ఆమె సమర్థతను గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీగా నియమించడం గర్వకారణని కొనియాడారు.ఇటువంటి నిజాయితీపరులైన రాజకీయ నేతలు సమాజానికి ఎంతో అవసరమని ఆయన వెల్లడించారు.అనంతరం తన సతీమణి బిందుతో కలిసి ఎమ్మెల్సీ దంపతులను శాలువాతో ఘనంగా సన్మానించి,జ్ఞాపికను అందజేశారు.ఈ కార్యక్రమంలో శ్రీ గుడ్విల్ కంప్యూటర్స్ సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో శంకర,తుమ్మచెట్లపల్లి సురేంద్ర,చల్లా రమేష్,శ్రీనాథ తదితరులు పాల్గొన్నారు.

కె. ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి