BREAKING
ఆపత్కాలంలో ఆపన్న హస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నిరు పేదల జీవితాల్లో పెన్షన్ల వెలుగులు! రాయికోడ్ మండలానికి 584 నూతన పెన్షన్లు మంజూరు మూడేళ్లయినా అమలుకాని రూ.4 వేల పెన్షన్ హామీ! అర్హులైన లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరి పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి పల్లె ప్రకృతి ఒడిలో ఫార్మ్ ఎలైట్ రిసార్ట్ ప్రారంభం 9 కోట్లతో భారీ నందీశ్వర స్వామి విగ్రహ నిర్మాణం 684 టన్నుల ఏకశిలతో సువర్ణ శృంగ నందీశ్వర విగ్రహం కాంగ్రెస్ హామీల అమలుకు మిగిలింది రెండేళ్లే! మూడేళ్లు గడిచినా పూర్తిస్థాయిలో అమలుకాని హామీలు జిన్నారం - బొంతపల్లి రోడ్డుపై ప్రమాదకర గుంతలు వాహనదారులకు పొంచి ఉన్న ప్రమాదం నైపుణ్య విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు వృత్తి కోర్సులపై ప్రత్యక్ష అవగాహన యాసంగి పంటలు షురూ.. కాలం కరుణిస్తుందా? కరువు ఛాయాల్లో యాసంగి సాగుకు సిద్ధమవుతున్న రైతన్నలు జ్ఞాన జ్యోతులకు ఘన నివాళి ధాన్యంకొనుగోళ్లలోరైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు wa పృథ్వీరెడ్డికి కేంద్ర మంత్రి ఆశీస్సులు ముగిసిన పాదయాత్ర.. కేసీఆర్‌ను కలిసిన మల్లేష్ బృందం! పాదయాత్ర బృందానికి కేసీఆర్ అభినందనలు నా అడ్డ తుంగతుర్తి.. నా గడ్డ తుంగతుర్తి.. నా పోరాటం తుంగతుర్తి కోసమే" చేయూత పెన్షన్ మంజూరి పత్రముల పంపిణీ కార్యక్రమములో ఎమ్మెల్యే మందుల సామేల్

10 రోజుల్లో 1TB డేటా అప్‌లోడ్ చేసిన కాఫీ మెషిన్.. బిత్తరపోయిన టెక్కీ:'అసలేం అప్‌లోడ్ చేస్తోందబ్బా?' అంటూ పోస్ట్ వైరల్!

Select Suryaa Now
 10 రోజుల్లో 1TB డేటా అప్‌లోడ్ చేసిన కాఫీ మెషిన్.. బిత్తరపోయిన టెక్కీ:'అసలేం అప్‌లోడ్ చేస్తోందబ్బా?' అంటూ పోస్ట్ వైరల్!

సూర్య టెక్ & విశేషాల డెస్క్: ఆధునిక స్మార్ట్ పరికరాలు  ఎంతటి విచిత్రమైన, అనుమానాస్పద పరిస్థితులను సృష్టిస్తాయో తెలియజేసే ఓ ఉదంతం తాజాగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. తమ ఇంట్లోని 'క్యూరిగ్'  స్మార్ట్ కాఫీ మేకర్ కేవలం 10 రోజుల వ్యవధిలోనే ఏకంగా 1 టీబీ (1000 జీబీకి పైగా) డేటాను అప్‌లోడ్ చేయడంతో పాటు 9.94 జీబీ డేటాను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు ఓ టెక్ నిపుణుడు గుర్తించి నిర్ఘాంతపోయాడు.

నెట్‌వర్క్ ట్రాఫిక్‌ను పరిశీలించిన సదరు టెక్కీ తీవ్ర ఆశ్చర్యానికి గురవుతూ.. "అసలు ఓ కాఫీ మెషిన్ ఏం అప్‌లోడ్ చేస్తోంది? వెంటనే దాన్ని ప్లగ్ నుంచి తొలగిస్తున్నా.. మా తల్లిదండ్రుల కోసం మరో కొత్త కాఫీ మెషిన్ కొంటాను" అంటూ సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేశాడు. కేవలం కాఫీ తయారుచేసే చిన్న పరికరం ఇంత భారీ మొత్తంలో డేటాను వినియోగించడం భద్రతాపరమైన ఆందోళనలను రేకెత్తించింది.

అయితే, తదుపరి పరిశీలన తర్వాత ఆ మెషిన్‌లోని సాఫ్ట్‌వేర్ బగ్ (సాంకేతిక లోపం) కారణంగానే నెట్‌వర్క్‌లో లూప్ ఏర్పడి ఈ స్థాయిలో డేటా రికార్డయి ఉంటుందని, ఆ డేటా తన హోమ్ నెట్‌వర్క్‌ను దాటి బయటకు (ఎస్కేప్) వెళ్లలేదని ఆయన స్పష్టం చేశాడు. ఏది ఏమైనప్పటికీ, ఇంట్లో ఉపయోగించే స్మార్ట్ హోమ్ పరికరాల డేటా భద్రత, ప్రైవసీపై ఈ ఘటన నెటిజన్లలో సరికొత్త చర్చను మొదలుపెట్టింది.