BREAKING
గొడవలు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు. పల్లె నిద్రలో సీఐ నాగమల్లేశ్వరరావు. ఏఐ ఆధారిత హ్యాకింగ్ దాడుల కలకలం: సైబర్ సెక్యూరిటీ బడ్జెట్‌ను భారీగా పెంచేందుకు బ్యాంకుల సన్నాహాలు! ఐఎంసీ 2026లో రోబోటిక్స్‌తో అదరగొట్టిన యువ శాస్త్రవేత్తలు: 'జెనీవా' గ్లోబల్ ఫైనల్స్‌కు భారత్ తరఫున అర్హత సాధించిన విజేతలు! గోవింద నామ స్మరణతో మార్మోగుతున్న తిరుమల గిరులు నస్పూర్ టీఎన్జీవో హౌసింగ్ సొసైటీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు వేడుకలను ప్రారంభించిన హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు గడియారం శ్రీహరి హ్యాకింగ్ ముఠాతో చేతులు కలిపిన అమెరికాలో కెనడా ఎగ్జిక్యూటివ్ అరెస్ట్ ఒమన్ గల్ఫ్‌లో ఇరాన్ నావికాదిగ్బంధాన్ని ఉల్లంఘించిన కార్గో నౌకను నిలిపివేసిన అమెరికా సైన్యం నవరాత్రుల వేడుకలకు ముస్తాబైన, కమల మల్లేశ్వరుడు. మహీంద్రా ఏరోస్పేస్ అనుబంధ సంస్థలో 51 శాతం వాటా కొనుగోలు చేయనున్న బ్రెజిల్ ఎంబ్రేయర్: కీలక ఒప్పందం కుదుర్చుకున్న ఎం&ఎం! అంతర్జాతీయ దిగ్గజ సంస్థల సీఈవోలతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ : భారత్‌లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలని పిలుపు! ఎన్నికల వేళ పోలీసుల అప్రమత్తం సమస్యాత్మక గ్రామాల్లో ముమ్మర గస్తీ.. గ్రామసభలతో ప్రజలకు అవగాహన ఎగుమతుల రంగంలో విశేష ప్రతిభ: అదానీ డిఫెన్స్‌కు ప్రతిష్టాత్మక ‘ఎస్ఐడీఎం ఛాంపియన్ అవార్డు 2026’! 2047 లక్ష్యాల సాధనకు భారత పరిశ్రమలు ఆవిష్కరణలను వేగవంతం చేయాలి: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపు! జోర్డాన్ కొత్త సరుకు రవాణా రైలు నెట్‌వర్క్:భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ లో కీలక లింక్‌గా మారే అవకాశం! ఆర్కిటిక్ మార్గంలో దక్షిణ కొరియా చారిత్రాత్మక వాణిజ్య నౌకాయానం

కోలాహలంగా బతుకమ్మ సంబరాలు

Select Suryaa Now
కోలాహలంగా బతుకమ్మ సంబరాలు

ఆటపాటలతో హోరెత్తిన మునగనూర్ ఎస్ బి హెచ్ కాలనీ.                      

ఆదిభట్ల సర్కిల్‌ పరిధిలోని తొర్రూర్‌ డివిజన్‌ మునగనూరు ఎస్‌బీహెచ్‌ కాలనీలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు పెద్ద సంఖ్యలో చేరి, సంప్రదాయ పాటలు పాడుతూ ఉత్సాహంగా నృత్యాలు చేశారు. సంప్రదాయ వస్త్రధారణలో ముస్తాబైన మహిళల ఆటపాటలు, కేరింతలు, బతుకమ్మ పాటలతో కాలనీ మారుమోగింది. ఒకరితో ఒకరు చేతులు కలిపి వలయాకారంగా తిరుగుతూ చేసిన సందడి పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పూల సోయగాలు, మహిళల ఉత్సాహం, పాటల హోరుతో కాలనీలో ఎటుచూసినా పండుగ కళ ఉట్టిపడింది. తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఆడపడుచుల ఐక్యతను చాటుతూ సాగిన సంబరాలు కాలనీవాసులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
– ఎడ్ల వెంకటేష్‌ గౌడ్, తుర్కయంజాల్, మేజర్ న్యూస్.