BREAKING
పేమెంట్ సిస్టమ్స్‌పై సైబర్ ముప్పు: ఫిన్‌టెక్, ఎన్‌బీఎఫ్‌సీలను హెచ్చరించిన 'సెర్ట్-ఇన్'! 'కరికాల'లో కథానాయికగా కేథరిన్ థ్రెసా: పిరియాడికల్ యాక్షన్ డ్రామాలో క్రేజీ రోల్! యూరప్‌లో 'ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్' పేరును మార్చిన టెస్లా:ఇకపై 'టెస్లా అసిస్టెడ్ డ్రైవింగ్'గా నామకరణం. నేరాల నియంత్రణలో సి.సి కెమెరాల పాత్ర కీలకం 'క్లాడ్ ఏఐ'తో దురుసుగా ప్రవర్తిస్తే ఖాతాలు రద్దు: యూజర్లకు ఆంత్రోపిక్ సంస్థ కఠిన హెచ్చరికలు! వీధి కుక్కల దాడిలో... 23 గొర్రెలు మృతి మెగాస్టార్ చిరంజీవి 'కాకా' మూవీ లేటెస్ట్ అప్‌డేట్: గ్రాండ్‌గా షూటింగ్, సంక్రాంతి బరిలోనే విడుదల! ఆలూరు గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే కాలె యాదయ్య హామీ బళ్లారి దుర్గమ్మను దర్శించుకున్న ఉమాదేవి దేవీ నవరాత్రుల తొలిరోజు ప్రత్యేక పూజలు రైళ్లలో లౌడ్ స్పీకర్లలో పాటలు, వీడియోలు పెడితే భారీ జరిమానా: హెచ్చరించిన భారతీయ రైల్వే.. జైలు శిక్ష విధించే అవకాశం! ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన కనకదుర్గమ్మ దర్శనం హౌసింగ్ బోర్డులో వైభవంగా కనకదుర్గమ్మ నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం ప్రసాద వితరణకు భక్తుల సహకారం.. దాతలకు ఆలయ కమిటీ కృతజ్ఞతలు అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ కాంబో మూవీ ఆగిపోయిందా: సోషల్ మీడియాలో రూమర్స్ నిజమెంత! భారత్‌లో స్టార్‌లింక్ సేవలను అందరికీ అందుబాటు ధరలోనే తెస్తాం.. అంబానీపై మరోసారి ఎలాన్ మస్క్ తీవ్ర వ్యాఖ్యలు! భారత్ సొంత ప్రభుత్వ-పౌర మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ ‘భారత్ సందేశ్’: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆవిష్కరణ!

ఎన్నికల వేళ పోలీసుల అప్రమత్తం సమస్యాత్మక గ్రామాల్లో ముమ్మర గస్తీ.. గ్రామసభలతో ప్రజలకు అవగాహన

Select Suryaa Now
ఎన్నికల వేళ పోలీసుల అప్రమత్తం  సమస్యాత్మక గ్రామాల్లో ముమ్మర గస్తీ.. గ్రామసభలతో ప్రజలకు అవగాహన

అనంతపురం బ్యూరో : రాబోయే ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా నిర్వహించడమే లక్ష్యంగా అనంతపురం జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా ప్రధాన ప్రాంతాలతో పాటు సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలు, కాలనీల్లో పోలీసు నిఘాను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఫుట్ పెట్రోలింగ్, పోలీసు గస్తీని ముమ్మరం చేశారు.

ఓటర్లలో భరోసా నింపేలా గ్రామసభలు

ఎన్నికల నేపథ్యంలో పలు గ్రామాల్లో పోలీసు అధికారులు, సిబ్బంది గ్రామసభలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా, ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా, ప్రలోభాలకు ఆకర్షితులు కాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తున్నారు.

చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు

ఎన్నికల వేళ గొడవలు సృష్టించడం, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం వంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, నిబంధనలను ఉల్లంఘించే వారు ఎంతటివారైనా చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

జిల్లాలో ప్రశాంత వాతావరణాన్ని పరిరక్షించేందుకు పోలీసు శాఖ అన్ని చర్యలు చేపడుతోందని అధికారులు తెలిపారు. ప్రజలు సంయమనం పాటిస్తూ, ఎన్నికల నిర్వహణకు సహకరించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తమ దృష్టికి వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని గ్రామసభల ద్వారా విజ్ఞప్తి చేశారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.