BREAKING
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పవన్ కు తోడు రాధా అడ్లూరులో ఘనంగా బతుకమ్మ వేడుకలు శాలిగౌరారం: మండల పరిధిలోని అడ్లూరు గ్రామంలో బతుకమ్మ వేడుకలను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, రం కళ్యాణదుర్గం పట్టణంలో ప్రత్యేక పోలీస్ బలగాలతో మార్చ్ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. త్రిపుర సుందరీదేవి దర్శనానికి భక్తుల వెల్లువ బతుకమ్మ వేడుకలకు గుర్జాల్ సర్పంచ్ మైక్ సెట్ కానుక పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. జీవో 153 జారీ! ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందాన్ని పుతిన్ కోరుకుంటున్నారు: డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు! రంపచోడవరం మన్యంలో నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన రష్యన్ డీజిల్ దిగుమతుల సడలింపుపై భగ్గుమన్న అమెరికన్ సెనేటర్లు: 16 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు.. సర్వదర్శనానికి 8 గంటల సమయం 70 ఏళ్ల వయసులో ఏషియన్ మాస్టర్స్ స్విమ్మింగ్ పోటీల్లో గోల్డ్, సిల్వర్ పతకాలు సాధించిన ఆర్మీ విశ్రాంత అధికారి గుగన్ సింగ్! బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్‌లో నాగ్ మాస్ క్లాస్: ఊహించని మలుపులతో ఈ వారం ఎలిమినేషన్ డ్రామా! పేమెంట్ సిస్టమ్స్‌పై సైబర్ ముప్పు: ఫిన్‌టెక్, ఎన్‌బీఎఫ్‌సీలను హెచ్చరించిన 'సెర్ట్-ఇన్'!

నేరాల నియంత్రణలో సి.సి కెమెరాల పాత్ర కీలకం

Select Suryaa Now
నేరాల నియంత్రణలో సి.సి కెమెరాల పాత్ర కీలకం

 

కొత్త బ్రాహ్మణపల్లి లో 15 సిసి కెమెరాలు ప్రారంభించిన ఇబ్రహీంపట్నం ఏసిపి రాజు

అసాంఘీకశక్తుల ఆగడాలు, నేరాల నియంత్రణలో సి.సి కెమెరాల పాత్ర అత్యంత కీలకమైనదని ఇబ్రహీంపట్నం ఏసిపి రాజు అన్నారు. ప్రజల భద్రత, ఆస్థుల పరిరక్షణకు పోలీసు శాఖ చేపట్టే చర్యలకు సిసి కెమెరాల నిరంతర నిఘా ఎంతగానో దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. మాడ్గుల మండలం కొత్త బ్రాహ్మణపల్లి గ్రామంలో సర్పంచ్ దుగ్గీంపూడి మర్రెడ్డి ఆర్థిక సహకారంతో ఏర్పాటుచేసిన 6 సిసి కెమెరాలు, అదేవిధంగా స్థానిక లూర్ధుమాత చర్చి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 10 కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏసిపి కెవిపి రాజు ముఖ్య అతిధిగా హాజరై సర్పంచ్ మర్రెడ్డి, మండల మాజీ కో ఆప్షన్ సభ్యులు తుమ్మ జోజిరెడ్డి, సి.ఐ వేణుగోపాల్, ఎస్.ఐ రాఘవేందర్ గౌడ్, స్థానిక మాజీ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డుసభ్యులు, గ్రామస్థులతో కలిసి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి సి.సి కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్థుల భద్రతను కాంక్షించి సొంత నిధులతో సిసి కెమెరాలు ఏర్పాటుచేసిన గ్రామ సర్పంచ్ దుగ్గీంపూడి మర్రెడ్డిని, లూర్ధుమాత చర్చి నిర్వహకులను ఏసిపి రాజు అభినందించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సర్పంచ్, మాజీ కోఆప్షన్ సభ్యులు, మాజీ సర్పంచ్, పంచాయతి పాలకవర్గసభ్యులు ఏసిపి, సి.ఐ, ఎస్.ఐ లను శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.

 ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బొమ్ము మంగమ్మ నాగయ్య, ఉప సర్పంచ్ బొమ్ము నవీన్ ( జోజి), వార్డు సభ్యులు లూర్ధురెడ్డి, కిషోర్ రెడ్డి,  గ్రామస్థులు పాల్గొన్నారు.

-ఆర్. నర్సింహ్మ, మేజర్ న్యూస్ : మాడ్గుల