BREAKING
సీనియర్ టీడీపీ నాయకుడు ఓబుళపతికి నేతల ఘన నివాళి పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేనివి మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం.. కుటుంబ సభ్యులకు నేతల పరామర్శ గ్రామ అభివృద్ధే నా ధ్యేయం, బాల్య వివాహాలు జరిగితే 1098కు సమాచారం అందించాలి -శక్తి టీం కాళహస్తీశ్వర స్వామి దేవస్థానమునకు బంగారు గాజులు విరాళం మృతదేహాన్ని మోసి మానవత్వం చాటిన కానిస్టేబుల్...... నదిలోకి దూకి మహిళ ఆత్మహత్య. కానిస్టేబుల్ కు పలువురి ప్రశంసలు..... పండుగకు ఊరెళ్తున్నారా.. ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండండి: మేడిపల్లి సీఐ జెలెందర్ రెడ్డి హెచ్చరిక ఆస్ట్రేలియా వైన్ రంగంలో వ్యవస్థాపక 'ఓట్లీ' కుటుంబానికే తిరిగి రోజ్‌మౌంట్ బ్రాండ్ విక్రయం బెజ్జూర్ లో భవనం లేక అరకొర వసతులతో ఆసుపత్రి - నూతన భవనం కోసం ప్రజావాణిలో అర్జీ జర్మనీ కొత్త కార్మిక మంత్రిగా అలెగ్జాండర్ ష్వైట్జర్ ఎంపిక నంద్యాలలో అత్యాధునిక ‘శ్రీ ధన్వి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నువ్ప్రారంభించిన రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మహేశ్వరం గ్రామ మంచినీటి ట్యాంకుల స్థలంపై సమగ్ర విచారణ జరపాలి ఇథియోపియాలో మొట్టమొదటి స్వర్ణ శుద్ధి కర్మాగారం ప్రారంభం అమెరికాలో పునరుత్పాదక ఇంధన వెంచర్‌ను విస్తరించిన 'టోటల్ ఎనర్జీస్' ఏఐ టెక్నాలజీ వృద్ధికి మెమరీ కొరత కాదు..మూలధనమే ప్రధాన అడ్డంకి మర్పల్లి మండలంలో 48 రీఛార్జ్ బోర్‌వెల్ నిర్మాణాలకు మంజూరు

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.

Select Suryaa Now
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.

గన్నవరం, మేజర్ న్యూస్.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని ఏపీ ప్రభుత్వ విప్‌, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. విజయవాడ కార్యాలయంలో శనివారం రాత్రి నిర్వహించిన గన్నవరం నియోజకవర్గ బీసీ సెల్ కమిటీ సమావేశంలో కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే, గౌతు లచ్చన్న చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో నంబర్లు 105, 1065 జారీ చేసిందని యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. అయితే, వైసీపీ నాయకులు న్యాయస్థానాలను ఆశ్రయించి రిజర్వేషన్ల అమలుకు అడ్డంకులు సృష్టించారని విమర్శించారు. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బీసీలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని సహించలేక, ఆ పార్టీ నాయకుడు ప్రసాద్‌రెడ్డితో హైకోర్టులో పిటిషన్‌ వేయించారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే 34 శాతం రిజర్వేషన్లు అమలై ఉంటే సుమారు 16,800 మంది బీసీలు రాజకీయంగా ఎదిగే అవకాశం లభించేదని పేర్కొన్నారు. పంచాయతీ సర్పంచులు, మున్సిపల్‌ మేయర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, జడ్పీ చైర్మన్లుగా బీసీలు పదవులు చేపట్టే అవకాశాలను వైసీపీ నాయకులు దూరం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో బీసీలు అభివృద్ధి చెందడం వైసీపీ నాయకులకు ఇష్టం లేదని, వారిని రాజకీయంగా అణగదొక్కేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో బీసీలపై వేధింపులకు పాల్పడ్డారని, గన్నవరం నియోజకవర్గంలోనూ బీసీ నాయకులపై పోలీసు కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు రాజకీయంగా అనేక అవకాశాలు కల్పించిందని యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. పార్టీ ద్వారా వేలాది మంది బీసీలు నాయకులుగా ఎదిగి చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించారని తెలిపారు. బీసీల హక్కుల పరిరక్షణ, వారి సామాజిక, రాజకీయ అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని చెప్పారు. బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం 34 శాతం రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పటికీ, వైసీపీ నాయకులు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో ఆటంకాలు ఎదురయ్యాయని వివరించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో పార్టీ పరంగా బీసీలకు 34 శాతం ప్రాతినిధ్యం కల్పించేలా చర్యలు తీసుకుంటామని యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. తన నాయకత్వంలో బీసీలకు పెద్ద సంఖ్యలో అవకాశాలు కల్పించి, స్థానిక సంస్థల్లో వారి ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. బీసీలంతా ఐకమత్యంతో ఉండి, తమకు లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొప్పన భవకుమార్ నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు ఆకుల జయసత్య, జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్‌, రాష్ట్ర బీజేపీ కిసాన్‌ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి, గన్నవరం ఏఎంసీ చైర్మన్‌ గూడవల్లి నరసింహారావు, టీడీపీ సీనియర్‌ నాయకులు దొంతు చిన్నా, నియోజకవర్గ బీసీ సెల్‌ అధ్యక్షులు మోదుగుమూడి సత్యనారాయణ, గొడ్డళ్ల చిన్న రామారావు, దయాల రాజేశ్వరరావు, గూడపాటి తులసిమోహన్‌, కొండేటి వెంకటేశ్వరరావు, వేగిరెడ్డి పాపారావు, రాజులపాటి నాగరాజు, మేడేపల్లి రమ, బోడపాటి రవి, కుందేటి చంద్రశేఖర్‌, పడమట రంగారావు, గంపా శ్రీనివాస్‌, గండికోట సీతయ్య, నబిగారి కొండయ్య, బొమ్మసాని అరుణ, సర్నాల బాలాజీ, బెజవాడ నాగేశ్వరరావు, జొన్నలగడ్డ సుధాకర్‌, చింతల వెంకట అప్పారావు, కొండేటి నాగరాజు, కొమ్మారెడ్డి రాజేష్‌, చిమటా రవివర్మ, అమృతపల్లి సూర్యనారాయణ, మందాడి రవీంద్ర, చెన్నుబోయిన సాంబశివరావు, మణిమాల అప్పారావు, దాసరి మహేష్‌, మున్నా రామకృష్ణ, అట్లూరి శ్రీనివాసరావు, కొల్లూరు చంద్రకాంత్‌, అక్కినేని గోకుల్‌, మొవ్వ వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

సూర్య ప్రతినిధి. గుర్రం ప్రసాద్, గన్నవరం, కృష్ణా జిల్లా.