BREAKING
రంపచోడవరం మన్యంలో నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన రష్యన్ డీజిల్ దిగుమతుల సడలింపుపై భగ్గుమన్న అమెరికన్ సెనేటర్లు: 16 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు.. సర్వదర్శనానికి 8 గంటల సమయం 70 ఏళ్ల వయసులో ఏషియన్ మాస్టర్స్ స్విమ్మింగ్ పోటీల్లో గోల్డ్, సిల్వర్ పతకాలు సాధించిన ఆర్మీ విశ్రాంత అధికారి గుగన్ సింగ్! బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్‌లో నాగ్ మాస్ క్లాస్: ఊహించని మలుపులతో ఈ వారం ఎలిమినేషన్ డ్రామా! పేమెంట్ సిస్టమ్స్‌పై సైబర్ ముప్పు: ఫిన్‌టెక్, ఎన్‌బీఎఫ్‌సీలను హెచ్చరించిన 'సెర్ట్-ఇన్'! 'కరికాల'లో కథానాయికగా కేథరిన్ థ్రెసా: పిరియాడికల్ యాక్షన్ డ్రామాలో క్రేజీ రోల్! యూరప్‌లో 'ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్' పేరును మార్చిన టెస్లా:ఇకపై 'టెస్లా అసిస్టెడ్ డ్రైవింగ్'గా నామకరణం. నేరాల నియంత్రణలో సి.సి కెమెరాల పాత్ర కీలకం 'క్లాడ్ ఏఐ'తో దురుసుగా ప్రవర్తిస్తే ఖాతాలు రద్దు: యూజర్లకు ఆంత్రోపిక్ సంస్థ కఠిన హెచ్చరికలు! వీధి కుక్కల దాడిలో... 23 గొర్రెలు మృతి మెగాస్టార్ చిరంజీవి 'కాకా' మూవీ లేటెస్ట్ అప్‌డేట్: గ్రాండ్‌గా షూటింగ్, సంక్రాంతి బరిలోనే విడుదల! ఆలూరు గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే కాలె యాదయ్య హామీ బళ్లారి దుర్గమ్మను దర్శించుకున్న ఉమాదేవి దేవీ నవరాత్రుల తొలిరోజు ప్రత్యేక పూజలు రైళ్లలో లౌడ్ స్పీకర్లలో పాటలు, వీడియోలు పెడితే భారీ జరిమానా: హెచ్చరించిన భారతీయ రైల్వే.. జైలు శిక్ష విధించే అవకాశం!

విద్యాసంస్థల పరిసరాల్లో మత్తు పదార్థాల విక్రయాలపై ఉక్కుపాదం మోపాలి..!

Select Suryaa Now
విద్యాసంస్థల పరిసరాల్లో మత్తు పదార్థాల విక్రయాలపై ఉక్కుపాదం మోపాలి..!

మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి, మేజర్‌ న్యూస్‌( అక్టోబర్‌ 11): విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్న మత్తు పదార్థాల విక్రయాలకు అడ్డుకట్ట వేయాలని, పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. విద్యాసంస్థలకు 100 గజాల పరిధిలో సిగరెట్లు, గుట్కా తదితర పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై నిషేధం ఉన్నప్పటికీ, నిబంధనల అమలును అధికారులు నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ విక్రయాలు, సరఫరాపై పోలీసు, ఎక్సైజ్‌ శాఖలు సమన్వయంతో తనిఖీలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం–2003 (కోట్పా)లోని సెక్షన్‌ 6(బి) ప్రకారం విద్యాసంస్థలకు 100 గజాల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలు నిషేధం. సెక్షన్‌ 6(ఎ) ప్రకారం 18 ఏళ్లలోపు వారికి పొగాకు ఉత్పత్తులను విక్రయించకూడదు. ఈ నిబంధనలను ఉల్లంఘించే దుకాణాలను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. పాఠశాలలు, కళాశాలల సమీపంలోని కిరాణా దుకాణాలు, పాన్‌ షాపుల్లో తనిఖీలు నిర్వహించి, విక్రయదారులకు నిబంధనలపై అవగాహన కల్పించాలి.పొగాకు ఉత్పత్తులతోపాటు గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ విక్రయాలపై ప్రత్యేక నిఘా అవసరం. విద్యాసంస్థల పరిసరాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే పోలీసు, ఎక్సైజ్‌ అధికారులకు సమాచారం అందించేలా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించాలి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఆహార భద్రతా శాఖ, ఎక్సైజ్‌ శాఖ, పోలీసు విభాగాలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి, ఉల్లంఘనలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకోవాలి.ఫిర్యాదుల కోసం జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్‌ కె. ఆనంద్‌ (7013377897), జిల్లా ఆహార భద్రతాధికారి పి. నీలీషా (7989329522), మేడ్చల్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఎస్‌.కె. ఫయాజుద్దీన్‌ (8712658727), మల్కాజిగిరి ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ బి. హనుమంతరావు (8712658728)లను సంప్రదించవచ్చు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో సమాచార నంబర్‌ 1908, అత్యవసర పోలీసు సహాయం కోసం 112కు ఫోన్‌ చేయవచ్చు.విద్యార్థులను వ్యసనాలకు దూరంగా ఉంచి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత. అధికారులు నిరంతర తనిఖీలు నిర్వహించి, అందిన ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తే విద్యార్థుల భవిష్యత్తుకు ముప్పుగా మారుతున్న మత్తు పదార్థాల విక్రయాలను నియంత్రించే అవకాశం ఉంటుంది.

రిపోర్టర్: పన్నాల బాల్ రెడ్డి, మేడ్చల్ జిల్లా ప్రతినిధి.