బళ్లారి దుర్గమ్మను దర్శించుకున్న ఉమాదేవి దేవీ నవరాత్రుల తొలిరోజు ప్రత్యేక పూజలు
అనంతపురం బ్యూరో : దేవీ నవరాత్రుల తొలి రోజు సందర్భంగా గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు, మాజీ దేవరగట్టు ఆలయ కమిటీ సభ్యుడు గుమ్మనూరు శ్రీనివాసులు సతీమణి ఉమాదేవి బళ్లారి పట్టణంలోని ప్రసిద్ధ దుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. దేవీ నవరాత్రుల ప్రారంభాన్ని పురస్కరించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు ఆమె ఆలయాన్ని సందర్శించారు.
నవరాత్రుల సందర్భంగా బళ్లారి దుర్గమ్మ ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. అమ్మవారి దర్శనంతో భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.