BREAKING
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పవన్ కు తోడు రాధా అడ్లూరులో ఘనంగా బతుకమ్మ వేడుకలు శాలిగౌరారం: మండల పరిధిలోని అడ్లూరు గ్రామంలో బతుకమ్మ వేడుకలను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, రం కళ్యాణదుర్గం పట్టణంలో ప్రత్యేక పోలీస్ బలగాలతో మార్చ్ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. త్రిపుర సుందరీదేవి దర్శనానికి భక్తుల వెల్లువ బతుకమ్మ వేడుకలకు గుర్జాల్ సర్పంచ్ మైక్ సెట్ కానుక పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. జీవో 153 జారీ! ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందాన్ని పుతిన్ కోరుకుంటున్నారు: డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు! రంపచోడవరం మన్యంలో నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన రష్యన్ డీజిల్ దిగుమతుల సడలింపుపై భగ్గుమన్న అమెరికన్ సెనేటర్లు: 16 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు.. సర్వదర్శనానికి 8 గంటల సమయం 70 ఏళ్ల వయసులో ఏషియన్ మాస్టర్స్ స్విమ్మింగ్ పోటీల్లో గోల్డ్, సిల్వర్ పతకాలు సాధించిన ఆర్మీ విశ్రాంత అధికారి గుగన్ సింగ్! బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్‌లో నాగ్ మాస్ క్లాస్: ఊహించని మలుపులతో ఈ వారం ఎలిమినేషన్ డ్రామా! పేమెంట్ సిస్టమ్స్‌పై సైబర్ ముప్పు: ఫిన్‌టెక్, ఎన్‌బీఎఫ్‌సీలను హెచ్చరించిన 'సెర్ట్-ఇన్'!

వీధి కుక్కల దాడిలో... 23 గొర్రెలు మృతి

Select Suryaa Now
వీధి కుక్కల దాడిలో... 23 గొర్రెలు మృతి

వీధి కుక్కల దాడి 23 గొర్రెలు మృతి చెందిన  సంఘటన చేవెళ్ల మండల పరిధిలోని ముడిమ్యాల గ్రామంలో జరిగింది. ఆ గ్రామానికి చెందిన మంద్ర మల్లేష్‌ గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్నారు. రోజు మాదిరిగానే శనివారం గొర్రెలను మేపి మందలో ఉంచాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత వీధి కుక్కలు దాడి చేయగా దాదాపు 23 గొర్రెలు మృత్యువాత పడగా మరిన్ని గొర్రెలకు గాయాలయ్యాయి. ఆదివారం ఉదయం గొర్రెల పరిస్థితిని చూసిన మల్లేష్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు.  రూ.3 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు తెలిపాడు.

వీధి కుక్కల బెడదపై గ్రామస్తుల ఆందోళన

గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత రైతును పరామర్శించి ధైర్యం చెప్పారు. గ్రామంలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోందని, వాటి వల్ల ప్రజలు, పశువులకు ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వీధి కుక్కల నియంత్రణకు తగిన చర్యలు చేపట్టాలని కోరారు.

బాధిత రైతుకు పరిహారం అందించాలి

వీధి కుక్కల దాడిలో జీవనాధారమైన గొర్రెలను కోల్పోయిన మంద్ర మల్లేష్‌ను ప్రభుత్వం ఆదుకోవాలని,  అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, బాధిత రైతుకు  తగిన పరిహారం అందేలా చూడాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గ్రామంలో వీధి కుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకున్నారు.

(చేవెళ్ల, మేజర్ న్యూస్)