కౌంటింగ్ ప్రక్రియ పై రిటర్నింగ్ అధికారులకు సహాయ, ఎఆర్ఓ లకు అవగాహన
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ : నెల్లూరు నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికలు - 2026 కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణ గురించి రిటర్నింగ్ ఆఫీసర్ / జాయింట్ కలెక్టర్ ఎమ్. వెంకటేశ్వర్లు, అడిషనల్ ఎలక్షన్ అథారిటీ / కమిషనర్ వై.ఓ నందన్ ల ఆధ్వర్యంలో ఎలక్షన్స్ మాస్టర్ ట్రైనర్ కనకరాజు రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు సోమవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో జరిగిన కౌంటింగ్ శిక్షణ కార్యక్రమంలో 3 వ తేదీ మంగళవారం జరగనున్న కౌంటింగ్ నిర్వహణకు సంబంధించి విభాగాల వారీగా సిబ్బంది పాటించవలసిన విధులను పటిష్టంగా అమలు చేయాలని వారు సూచించారు.