BREAKING
న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణం అమలు చేయాలి.. సాకే నరేష్ క్విస్ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌లో జిల్లాస్థాయి క‌బ‌డ్డీ పోటీలు పల్లె పండుగ–3.0లో భాగంగా శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ. వికారాబాద్ జిల్లాలో లా & ఆర్డర్ డీజీ మహేష్ భగవత్ పర్యటన, పోలీస్ స్టేషన్ల నిర్మాణ పనుల పరిశీలన అనంతలక్ష్మీ కళాశాలలో ప్రాంగణ నియామకాలు పొలం వద్ద ఘర్షణలో వ్యక్తి మృతి రైల్వే పనులపై రాజీ లేదు -ఏలూరు రైల్వే స్టేషన్ మొత్తం తనిఖీ చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి -- టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి, ఎంపీ పుట్టా మహేష్, ఎమ్మెల్యే చింతమనేని నాబార్డ్ అధ్వర్యంలో రైతులకు వరి విత్తనోత్పత్తిపై అవగాహన సదస్సు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గన్నవరంలో ఘనంగా మహబూబ్‌ సుభాని గ్యారమీ పండుగ వేడుకలు. క్రీడలకు డైమండ్స్ లయన్స్ ప్రోత్సాహం.. మూడు గ్రామాలను కలిపే నక్షబాటపై కబ్జా ఆరోపణలు.. ప్రజా రహదారిపై ప్రహరీ గోడ నిర్మాణం శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా కోకైన్ పట్టివేత అడవి పందిని వేటాడిన ఇద్దరు వ్యక్తులను పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు

కర్నూలు స్టేడియంలో ఫుట్‌బాల్ గ్రౌండ్ ను ప్రారంభించిన మంత్రి టీజీ భరత్ గుప్త

Select Suryaa Now
కర్నూలు స్టేడియంలో ఫుట్‌బాల్ గ్రౌండ్ ను ప్రారంభించిన మంత్రి టీజీ భరత్ గుప్త

 

*కర్నూలు స్టేడియంలో ఫుట్‌బాల్ గ్రౌండ్ ను ప్రారంభించిన మంత్రి టీజీ భరత్ గుప్త*

*కర్నూలును స్పోర్ట్స్ హబ్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యం*

*స్టేడియంలో రూ.3.50 కోట్లతో అభివృద్ధి పనులు చేశాం*

*పరిశ్రమలు వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్త*


కర్నూలు, సెప్టెంబర్ 30 :-కర్నూలు స్టేడియం అభివృద్ధికి రూ 3.50 కోట్లతో పనులు చేశామని,కర్నూలులో క్రీడల అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తామని మంత్రి టీజీ భరత్ గుప్త ఫుట్బాల్ స్టేడియం ప్రారంభోత్సవ సమావేశంలో పేర్కొన్నారు.


ఈ సమావేశాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ...3 కోట్ల 50 లక్షల రూపాయలతో స్టేడియం లో అభివృద్ధి పనులు చేశామని , ఇంకా కొన్ని పనులు జరుగుతూ ఉన్నవి అని మంత్రి తెలిపారు.
క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నామని,
క్రీడాకారుల కోసం వాలీబాల్, పికిల్‌బాల్, ఫుట్‌బాల్, కబడ్డీ కోర్టుల అభివృద్ధి.వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్‌తో మరియు సింథటిక్ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు.క్రీడాకారులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని మంత్రి తెలియజేశారు. కర్నూలులో అన్ని క్రీడల అభివృద్ధికి టీజీవీ కుటుంబం మొదటి నుండి అన్ని సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నదని మంత్రి తెలియజేశారు.

స్పోర్ట్స్ హాస్టల్ ఇక్కడి నుండి వెళ్లకుండా ఆపామని  ,జిమ్ సెంటర్ సమస్యలు తీర్చామని తెలిపారు.ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ  పరిష్కరిస్తూ ఉన్నామని, అపహాలకు పోరాదని విజ్ఞప్తి చేశారు. వినాయక నిమజ్జనానికి అన్ని అడ్డంకులు తొలగించి ఘనంగా కార్యక్రమాన్ని జరిపించామని తెలియజేశారు.


ఇటువంటిఅభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఒక్కరికీ తెలిసేలా సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించాలని మంత్రి టీజీ భరత్ గుప్త మీడియా ప్రతినిధులకు సూచించారు.


అనంతరం మంత్రి ఆకుపచ్చని ఫుట్బాల్  స్టేడియం లో క్రీడాకారులను పరిచయం చేసుకొని ఎగ్జిబిషన్ మ్యాచ్ ను గోల్ కొట్టి ప్రారంభించారు.


ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు , డిఎస్ డి వో భూపతి రావు , చైర్మన్ రాజశేఖర్ , జిల్లా ఒలంపిక్ సంఘ అధ్యక్షుడు రామాంజనేయులు, శ్రీకాంత్ సుధీర్, క్రీడల కోచ్ లు , క్రీడా సంఘాల అధ్యక్షులు ,క్రీడాకారులు పాల్గొన్నారు.