BREAKING
అదానీ విద్యుత్ ప్రాజెక్టు వ్యయం తగ్గింపుపై కేంద్ర పర్యావరణ శాఖ విచారణ చకుముఖి టాలెంట్ టెస్టులో శ్రీవాణి విద్యార్థుల ప్రతిభ మండల స్థాయి పోటీలకు ముగ్గురు విద్యార్థుల ఎంపిక పాకిస్థాన్‌కు సైనిక రహస్యాల చేరవేత: వాయుసేన వింగ్ కమాండర్‌పై చార్జిషీట్ దాఖలు చేసిన ఢిల్లీ పోలీసులు రైతుల విద్యుత్ కష్టాలకు తెర.. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వార్డుల్లో నీటిని, విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ నావికుడు...అత్యవసర సర్టిఫికేట్ జారీ, త్వరలో స్వదేశానికి రాక భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును కాపాడుకుందాం నగర సంకీర్తనతో ఆధ్యాత్మిక మేలుకొలుపు ఏకంగా 22 కిలోల బరువు తగ్గిన ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి.. కొత్త లుక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే! పరాగ్వే మాజీ అధ్యక్షుడు శాంటియాగో పెన్యాపై మరింత ఉచ్చు మల్లన్నసాగర్ లీకేజీపై హరీశ్‌రావుకు కవిత సవాల్! అవినీతి ఆరోపణలపై విచారణకు సిద్ధమా..? సీఎం రేవంత్‌ రెడ్డికి సూటి ప్రశ్నలు కాకరకాయ తింటే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుందా.. మధుమేహ బాధితులకు నిపుణుల కీలక సూచనలు! వైఎస్సార్‌సీపీలో చేరిన జనసేన జిల్లా కార్యదర్శి అల్జీరియా వాణిజ్య నిబంధనలపై యూరోపియన్ కమిషన్‌ను ఆశ్రయించిన ఫ్రాన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజం ఆంత్రోపిక్‌పై ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన కేసు

కపిలతీర్థంలో వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం ప్రారంభం

Select Suryaa Now
కపిలతీర్థంలో వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం ప్రారంభం

కపిలతీర్థంలో వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం ప్రారంభం

*కార్తీక మాస హోమ మహోత్సవాల్లో భాగంగా విశేష పూజలు, హోమాలు

తిరుపతి బ్యూరో,మేజర్ న్యూస్ : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు నిర్వహిస్తున్న కార్తీక మాస హోమ మహోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం భక్తిశ్రద్ధలతో ప్రారంభమైంది.
ఈ సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు యాగశాలలో విశేష పూజలు, హోమం, లఘుపూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు హోమం, సహస్రనామార్చన, విశేష దీపారాధన నిర్వహించనున్నారు. శుక్రవారం కూడా హోమం కొనసాగనుంది.
గృహస్తులు రూ.500 చెల్లించి ఒకరోజు హోమంలో పాల్గొనవచ్చు. పాల్గొనే వారికి ఒక ఉత్తరీయం, ఒక రవికెతో పాటు అన్నప్రసాదం అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో  నాగరత్న, ఏఈవో  కుమారి దేవి, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


Raaju బ్యూరో, తిరుపతి జిల్లా,