BREAKING
ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓటు వేయాలి పూతలపట్టు సీఐ తిమ్మయ్య అయ్యప్ప దేవస్థానంలో ఘనంగా ప్రారంభమైన మండల పూజలు నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి అండగా ఉంటాం. ఎమ్మెల్యే అమిలినేని. అడవి ఆముదం గింజలు తిని 10 మంది విద్యార్థులు అస్వస్థత.. ఒకరి పరిస్థితి విషమం MLC మీర్జా రహమత్ బేగ్ బ్లాక్‌మెయిల్ కేసులో కీలక పరిణామం.. సల్మాన్ ఖాన్ అరెస్ట్, రిమాండ్ పంచాయతీ ఎన్నికలకు కూటమి సంసిద్ధం గెలుపు లక్ష్యంగా నాయకులకు దిశా నిర్దేశం - ఎమ్మెల్యే ముత్తుముల పూతలపట్టులో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు అట్టహాసంగా 'అష్టదిగ్గజాలు' కవి సమ్మేళనం ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎంపీ భాష్యం రామకృష్ణ ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత కేంద్రాలకు తరలించాలి: పవన్ కళ్యాణ్ అమరుల స్ఫూర్తితో.. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ప్రముఖ మలయాళ గాయని రిమి టోమి రెండో వివాహం, జిమ్ ట్రైనర్ లిబిన్ మాత్యుతో వైభవంగా పెళ్లి ఇంకొల్లు మండలంలో చివరి రోజు సర్పంచ్‌, వార్డు సభ్యులకు 228 నామినేషన్లు దాఖలు ఈనెల 20న, 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం కోలాహలంగా రాచానుపల్లి వైసీపీ మద్దతు దారుడు, సర్పంచ్ అభ్యర్థి బండ అంజి యాదవ్ నామినేషన్ ఇంట్లోనే మద్యం దుకాణమా.. ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యమా?

కలెక్టరేట్ గ్రంథాలయానికి పుస్తకాలను బహుమతిగా ఇవ్వడం అభినందనీయం : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి,

Select Suryaa Now
కలెక్టరేట్ గ్రంథాలయానికి పుస్తకాలను బహుమతిగా ఇవ్వడం అభినందనీయం : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి,

బాపట్ల, మేజర్‌న్యూస్‌ :

 కలెక్టరేట్ గ్రంథాలయానికి పుస్తకాలను బహుమతిగా ఇవ్వడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, అన్నారు. కలెక్టరేట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయానికి పుస్తకాలు ఇవ్వాలని  కోరడంతో అధికారులు ముందుకు వచ్చారు. ఆయా శాఖల జిల్లా అధికారులు సోమవారం ఒక్క రోజే 77 పుస్తకాలను బహుమతిగా అందించారు.       
         అధికారులు దాతృత్వంతో కలెక్టరేట్ గ్రంథాలయానికి పుస్తకాలు బహుకరించడం సంతోషదాయకమని కలెక్టర్ అన్నారు. పుస్తకాలు అందించిన అధికారులను ప్రశంసించారు. బాపట్ల ఆర్డిఓ హరికుమార్ భారత దేశ చరిత్ర, రాజ్యాంగానికి సంబంధించిన పుస్తకాలు అందించారు. అలాగే పట్టాదారు పాస్ పుస్తకాలు, భూమి హక్కులు, రెవెన్యూ చట్టాలపై 10 పుస్తకాలను చీరాల ఆర్డీఓ నరసింహారావు అందజేశారు. శ్రీమధ్భవద్గీత పుస్తకాన్ని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వేణుగోపాల్ బహుకరించగా, శ్రీకృష్ణుడు చరిత్ర, రామాయణం పుస్తకాలను ఇంటర్మీడియట్ బోర్డ్ జిల్లా అధికారి ఎల్. కోదండరామ్ ఇచ్చారు. భూగర్భ జలాలు, భూగర్భ జల చట్టం అమలుపై రూపొందించిన పుస్తకాలను భూగర్భ జల శాఖ ఏడి సురేష్ బహుకరించగా, జ్ఞాపక శక్తిని పెంపొందించుకునే విధానాలపై పుస్తకాలను ఆర్టీసీ ఆర్ఎం విమల అందజేశారు. బైబుల్, ప్రశాంతను కల్పించే పుస్తకాలను మార్క్ ఫెడ్ డీఎం కరుణశ్రీ, అందించారు. వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలపై 4 పుస్తకాలను ఎల్ డి ఎం శివకృష్ణ అందజేయగా, రవాణా శాఖ అధికారి పరంధామరెడ్డి వివిధ చట్టాలు, చరిత్ర, తదితరమైన 18 పుస్తకాలను బహుకరించారు. జిల్లా పరిషత్ సీఈవో విజయలక్ష్మి 18 పుస్తకాలు, వ్యవసాయ శాఖ అధికారిని లక్ష్మి ఐదు పుస్తకాలు, డ్వామా పీడీ విజయలక్ష్మి రెండు పుస్తకాలు, జిఎస్టి అధికారులు 8 పుస్తకాలు, వేటపాలెం తహసిల్దార్ పౌర హక్కులు, చట్టాలపై నాలుగు పుస్తకాలు బహుమతిగా అందజేశారు. జిల్లా అధికారులు, ప్రజలెవరైనా స్వచ్ఛందంగా తమ వద్ద వృద్ధగా ఉన్న పుస్తకాలను గ్రంథాలయానికి బహుకరించవచ్చన్నారు.          ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.