BREAKING
కంటోన్మెంట్ టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి ఆరోపణలు.. సీబీఐ ముమ్మర విచారణ *కుర్వపల్లి మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలి: సంకాపురం రాముడు** గుంటూరు మేయర్‌గా కోవెలమూడి లక్ష్మి అపర్ణ ప్రమాణ స్వీకారం: డిప్యూటీ మేయర్‌గా యర్రంశెట్టి రాజేష్ ఎన్నిక చిన్నారులపై మతపరమైన ఒత్తిడి తగదు వీణవంకకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయాలి – బీసీ గురుకుల పాఠశాలను తక్షణమే తరలించాలి రెండో విడత దళితబంధు విడుదల చేయాలి అద్దేపల్లి లో సాయిబాబా ఎన్నికల ప్రచారం నా ప్రశ్నలకు జవాబు ఎవరిస్తారు....!? ** ముఖ్యమంత్రా... జిల్లా మంత్రా...!? ఆ డైరెక్టర్లకు జీవితాంతం రుణపడి ఉంటా: శర్వానంద్ నాగచైతన్యకు వెంకటేశ్ బర్త్‌డే విషెస్.. పోస్ట్ వైరల్ సులభంగా రైతులు ఎరువులు బుకింగ్ కోలాహలంగా అద్దంకి మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం. ఆధ్యాత్మిక గురువు సద్గురు పాదాలకు నమస్కరించిన తమన్నా.. వీడియో వైరల్ కాల్వబుగ్గలో భక్తజన సందోహం!** కిరణ్ అబ్బవరం కొత్త సినిమా.. 'రికార్డ్' టైటిల్ రివీల్

కచ్చితంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి: ఎంపీ నాగరాజు

Select Suryaa Now
కచ్చితంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి: ఎంపీ నాగరాజు

*కచ్చితంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి: ఎంపీ నాగరాజు*
- హృదయ ఆరోగ్యంపై కిమ్స్‌ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో వాక్ 
- ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ నాగరాజు

*కర్నూలు, 29 సెప్టెంబర్ 2026:* గుండె చెప్పినట్లు మనం తప్పకుండా వినాలని అన్నారు కర్నూలు ఎంపీ బస్తీపాటి నాగరాజు. అంతర్జాతీయ హృదయ దినోత్సవాన్ని పురస్కరించకొని కిమ్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాక్ మరియు ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రాజ్ విహార్ వద్ద మొదలైన వాక్ కలెక్టరేట్ వరకు సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వయసు పెరిగిన కొద్ది వ్యాధులకు గురవుతాము. అయితే ఆ వ్యాధులను ముందుగానే గుర్తించడానికి ప్రతీ ఒక్కరూ పూర్తి హెల్త్ చెకప్ లు చేయించుకోవాలని సూచించారు. ప్రజల్లో గుండె సంబధింత వ్యాధులపై అవగాహన పెంచడానికి కిమ్స్ హాస్పిటల్స్ ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయడం గర్వించదగిన విషయమన్నారు. అవగాహన కార్యక్రమాలతో ప్రజల్లో విసృత ప్రచారం జరుగుతుందన్నారు.

అనంతరం సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ & కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ పసుల ఆనంద్ యాదవ్, ఇంటర్వేన్షనల్ కార్డియాలజిస్టులు డా. నాగేంద్ర ప్రసాద్, డా. సందీప్ కుమార్, డా అరుణ మాట్లాడుతూ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చిన్న వయసు నుంచే ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం అవసరమన్నారు. నేటి జీవనశైలిలో శారీరక శ్రమ తగ్గడం, అధిక ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. రోజూ కొంత సమయం వ్యాయామానికి కేటాయించడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, పొగతాగడం, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండటం ద్వారా గుండె జబ్బుల ముప్పును తగ్గించుకోవచ్చని సూచించారు.

గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పించడం ఒక్కరోజుకే పరిమితం కాకూడదు. ప్రతి రోజూ మన జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, బరువును నియంత్రణలో ఉంచుకోవడం, రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్‌ వంటి సమస్యలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అధిక చెమటలు, అకస్మాత్తుగా బలహీనంగా అనిపించడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి” అని సూచించారు. గుండె జబ్బులు వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే, ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యమన్నారు. ముఖ్యంగా యువతలో పెరుగుతున్న జీవనశైలి సంబంధిత ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డా. ఫరూక్, కిమ్స్ హాస్పిటల్స్ కర్నూలు యూనిట్ ఏవీపీ డా. ఆదిత్య, మెడికల్ సూపరిడెంట్ డా. రాజేష్, మార్కిటింగ్ జీఎం ఆనంద్, మైపర్ విద్యార్థులు, వైద్యలు, సిబ్బంది, స్థానికి ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.