_జూలకల్లు పాఠశాలలను తనిఖీ చేసిన మండల విద్యాశాఖ అధికారి ఖాసీం_ పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ పిడుగురాళ్ల మండల విద్యాశాఖ అధికారి ఎండీ ఖాసీం మండలంలోని జూలకల్లు గ్రామంలో గల మండల ప్రాథమిక పాఠశాల (ఉర్దూ) మరియు మండల ప్రాథమిక పాఠశాల (ప్రధాన) లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో ఉపాధ్యాయులతో సమావేశం
పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్: పిడుగురాళ్ల మండల విద్యాశాఖ అధికారి ఎండీ ఖాసీం మండలంలోని జూలకల్లు గ్రామంలో గల మండల ప్రాథమిక పాఠశాల (ఉర్దూ) మరియు మండల ప్రాథమిక పాఠశాల (ప్రధాన) లను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాలల్లో ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. మొదటి నిర్మాణాత్మక మూల్యాంకన ప్రశ్నాపత్రాలను ఉపాధ్యాయులు జాగ్రత్తగా దిద్దాలని, ఎటువంటి తప్పులకు ఆస్కారం లేకుండా చూసుకోవాలని సూచించారు.
మూల్యాంకనం అనంతరం విద్యార్థులకు మార్కులు తెలియజేసి, అనంతరం ప్రత్యేక అనువర్తనంలో మార్కులు నమోదు చేయాలని, ఈ విషయంలో ఎవరూ అలసత్వం వహించవద్దని ఖాసీం తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వెంకట్ జర్నలిస్ట్ పిడుగురాళ్ల