జిల్లా స్థాయి ఉత్తమ పారిశుధ్య కార్మికుడిగా బి. సహదేవుడికి సన్మానం
ఇరగవరం,మేజర్ న్యూస్ :ఇరగవరం మండలం రేలంగి గ్రామ పంచాయతీలో పారిశుధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న బి. సహదేవుడుకి జిల్లా ఉత్తమ పారిశుధ్య కార్మికుని గుర్తింపు లభించింది.గాంధీ జయంతిని పురస్కరించుకుని భీమవరం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతులమీదుగా సన్మానించారు తన విధుల్లో ఉత్తమ సేవలు అందించినందుకు జిల్లా స్థాయిలో ఉత్తమ పారిశుధ్య కార్మికుడిగా గుర్తింపు పొందినట్లు మండల ప్రత్యేక అధికారి కి. వి. వి. సత్యనారాయణ తెలిపారు.అన్నిగ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులు చిత్తశుద్ధితో పనిచేయడం వల్ల ఇలాంటి గౌరవం లభించినట్లు చెప్పారు.
జిల్లా స్థాయిలో ఉత్తమ పారిశుధ్య కార్మికుడిగా గుర్తింపు పొందిన బి. సహదేవుడికి గ్రామ ప్రజలు, మండల, గ్రామస్థాయి అధికారులు ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు
దొరబాబు ఇరగవరం