జిల్లా స్థాయి స్వఛ్చ హాస్పిటల్ అవార్డ్ అందుకున్న డాక్టర్ కరుణాకర్
నెల్లురు సిటి మేజర్ న్యూస్ : స్వఛ్చాంధ్ర -స్వర్ణాంధ్ర కార్యక్రమములో భాగంగా రాష్ట్ర ప్రభుత్వమువారు ప్రతిస్టాత్మకముగా నిర్వహించిన అవార్డ్ కార్యక్రమములో జిల్లాస్థాయిలో ఇనమడుగు హోమియో వైద్యశాలను స్వఛ్చహాస్పిటల్ గుర్తించడము జరిగింది ఈ స్వఛ్చహాస్పిటల్ అవార్ద్ ని జిల్లా కలెక్టర్ హిమాన్ష్ శుక్ల గారి చేతులమీదగా ఇనమడుగు హోమియోవైద్యులు డా కరుణాకర్ అందుకున్నారు . నెల్లురు జిల్లాలో మొత్తము 26 కేటగిరిల్లో విశిష్ట సేవలు అందించిన వివిద రకాల ప్రభుత్వ సంస్థలకు ఉద్యోగులకు ఈ అవార్డ్ లను ఇవ్వడము జరిగింది ఇందులో భాగంగా హాస్పిటల్ పరిసరాల శుభ్రత , నీటి సౌకర్యము ఓపి సేవలు రికార్డ్ మెయింటినెన్స్ మొదలగు విషయాల ఆదారంగా ర్యాంకింగ్ ఆదారముగా నెల్లురు జిల్లాలో 3 ఆయుష్ హాస్పిటల్స్ ని హోమియోపతిలో ఇనమడుగు హోమియో వైద్యశాలను ఆయుర్వేద వైద్యశాలలు నెల్లురు , దమ్మాయిపాళెమ్ స్వఛ్చ హాస్పిటల్ గా సెలెక్ట్ ఐనవి కావున డా కరుణాకర్ డా సుధారాణి , డా చంద్రమౌలిలు ఈ అవార్డ్ లను అందుకున్నారు ఇనమడుగు హోమియో వైద్యులు డా కరుణాకర్ మాట్లాడుతు ఈ అవార్డ్ కి జిల్లాస్థాయిలో ఇనమడుగు హోమియో వైద్యశాల ఎంపికవ్వడము చాల ఆనందముగా ఉన్నదని ఇది మరింత బాధ్యతను పెంచిందని ఇనమడుగు వైద్యశాలకు రోజుకి 30-40 వరకు పేషెంట్స్ వస్తున్నారు వారికి అన్ని వసతులు అనగా నీళ్లు , వాష్ రుమ్ వసతి మందులు అన్ని సమృద్దిగా అందిస్తున్నామని ఇక్కడ సేవలకి రోగులు సంతృప్తి వ్యక్తము చెస్తున్నారని వైద్యసేవలు కూడా భెష్ గా ఉన్నాయని అనందపడడము ఇంకాస్త సేవలు అందించడానికి ప్రేరణ కలిగిస్తుందని తెలిపారు ఇదె ఉత్సాహముతో మరింతగా పనిచేసి ఇనమడుగు హోమియోవైద్యశాల స్వఛ్చత విషయములో ఓపి సేవల విషయములో జిల్లాస్థాయి లోను రాష్ట్ర స్థాయిలో కూడా ముందు ఉండేలా చూస్తామని ఇనమడుగు హోమియో వైద్యులు డా కరుణాకర్ తెలిపారు