BREAKING
నేటి రాశి ఫలాలు –21 అక్టోబర్ 2026 అగ్నిప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్యెల్యే ఉగ్ర నరసింహారెడ్డి దసరా ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట బందోబస్తు మెట్లకుంట దుర్గామాత ఉత్సవాల్లో పోలీసుల సేవలకు సలాం.. ఏఎస్ఐ జైపాల్ రెడ్డికి ఘన సన్మానం పశ్చిమ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు బి-ఫారాలు అందజేత వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ మైనార్టీలతో ఆత్మీయ సమావేశం హిందూపురంలో 50 మంది వైసీపీ నుండి టిడిపిలోకి చేరిక సలాం పోలీస్... - పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేం - ఏ ఆపద వచ్చినా మొదట ఆశ్రయించేది పోలీసులనే - సంచలనం సృష్టించిన ఎస్పీ పరదేశి నాయుడు పై మావోల దాడి - అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం మెట్లకుంటలో వైభవంగా దుర్గామాత నిమజ్జన మహోత్సవం.. రూ.51 వేలకు లడ్డూ, రూ.30 వేలకు అమ్మవారి చీర వేలం సంగారెడ్డిలో దసరా వేడుకలకు భారీ ఏర్పాట్లు సిద్దిపేటకు యూనివర్సిటీనే నెక్స్ట్ టార్గెట్..! 16వ వార్డులో టీడీపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలి భవాని మాత యూత్ అసోసియేషన్‌కు ఐదేళ్లుగా చేవెళ్ల మహి చేయూత.. కాసుల మహేందర్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపిన BMYA భారతీనగర్ డివిజన్‌లో ఘనంగా దసరా వేడుకలు ఉయ్యూరు మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలి

జిల్లా ప్రగతి, రాష్ట్ర అభివృద్ధియే ధ్యేయం

Select Suryaa Now
జిల్లా ప్రగతి, రాష్ట్ర అభివృద్ధియే ధ్యేయం

నెల్లూరు,  మేజర్ న్యూస్ :   విజయదశమి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ, నెల్లూరు జిల్లా వాసులకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ  తన హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ పవిత్రమైన రోజున అమ్మవారి దివ్య ఆశీస్సులతో రాష్ట్రంలోని ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.​ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సుదూర విజన్, యంగ్ లీడర్ మంత్రి నారా లోకేష్ గారి సమర్థవంతమైన నాయకత్వంలో మన అమరావతి రాజధానిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు అంకితభావంతో రాత్రింబవళ్లు కృషి చేస్తున్నామని. రాష్ట్ర భవిష్యత్తును స్వర్ణమయం చేసే దిశగా మా ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోందన్నారు.​అలాగే నెల్లూరు జిల్లా సమగ్రాభివృద్ధికి, స్థానిక ప్రజల సంక్షేమానికి మేము సంపూర్ణంగా కట్టుబడి ఉన్నామని. జిల్లాలోని ప్రతి అర్హుడికీ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తూ, మౌలిక వసతుల కల్పనతో నెల్లూరును రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా నిలబెడతామన్నారు.. విజయదశమి స్పూర్తితో దుష్టశక్తులపై మంచి విజయం సాధించి, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తాం, అని స్పష్టం చేశారు.​ప్రజలందరూ పండుగను ఆనందోత్సాహాల మధ్య, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కోరుకుంటూ మంత్రి నారాయణ మరొక్కసారి రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు అందజేశారు.