BREAKING
అన్యాయానికి గురవుతున్న కార్మికుల అంశాన్ని హై లెవెల్ మంత్రుల కమిటీ దృష్టికి తీసుకెళ్తా.. బిజెపి నేత మిడతల రమేష్ కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్‌ పథకాలకు 12 ఏళ్లు.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. సల్మాన్ ఖాన్ ప్రస్తావనపై అలిగిన అర్బాజ్ ఖాన్.. ముంబై ఈవెంట్‌లో అసహనం హాలీవుడ్ ప్రీమియర్‌లో టమ్ క్రూయిజ్‌ను కలిసిన అవ్నీత్ కౌర్.. డిగర్ సినిమాపై ఆసక్తికర చర్చ కాలు కోల్పోయిన కూలికి మానవతా హస్తం టీమిండియా ఆటగాళ్లకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు ఈ నెల 11 నుంచి 20 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని అడ్డుకుంటున్నది వైసీపీనే ఎమ్మెల్యే పరిటాల సునీత విమర్శ కురుగుంట అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరం రెేపు గన్నవరంలో విద్యుత్ సరఫరా నిలిపివేత.. 57 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన అమన్ సెహ్రావత్ అక్టోబర్ 9న తెలుగులో ‘హనుమాన్ అంశ్’ విడుదల.. హోంబలే ఫిల్మ్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ ఎంట్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా అశోక్ ఎమ్ ఎస్ గ్లోబల్ ట్రేడర్స్ సంస్థను తనిఖీ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆది పినిశెట్టి ‘మరకతమణి 2’ షూటింగ్ పూర్తి.. పోస్ట్ ప్రొడక్షన్ పనులతో జోరు

జిల్లా జైలు నందు గాంధీ జయంతి సందర్బంగా వేడుకలు ”

Select Suryaa Now
జిల్లా జైలు నందు గాంధీ జయంతి సందర్బంగా వేడుకలు ”

 

“జిల్లా జైలు నందు గాంధీ జయంతి సందర్బంగా వేడుకలు ”

ఈ రోజు అనగా 02-10-2026 న జిల్లా జైలు నందు జాతిపిత మహాత్మా గాంధీ పుట్టిన రోజైన అక్టోబర్ 2 న గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమములో కర్నూలు  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి, పంచాలింగాల మాంటిసోరి  స్కూల్ డీన్ సిద్దు, జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణు గోపాల్ రెడ్డి , జిల్లా జైలు జైలర్ జి.యర్కి నాయుడు గారు, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శివరామచంద్రరావు, డిప్యూటీ జైలర్లు  పాల్గోని గాంధీ గారికి పూలమాలలను వేసారు.జడ్జి గారు మాట్లడుతూ అక్కడున్న ఖైదీలకు గాంధీ గారి   బాల్యం ను,   గాంధీజీ నడిపిన ముఖ్యమైన పోరాటాలు, కొన్ని సూక్తులు,  ముఖ్యమైన సందేశాలను గురించి తెలియజేసారు. ఈ సందర్భంగా జైల్లో ఉన్న ఖైదీలు సత్ప్రవర్తనంతో శిక్ష ను పూర్తి చేయాలని కోరారు. ఖైదీలకు ఎవరికైనా న్యాయవాదులు లేకుంటే ఉచిత న్యాయవాదులను నియమిస్తామని తెలిపారు.  ఖైదీలకు అందించే ఆహారాన్ని, రేషన్ను వారి ఆరోగ్యం గురించి తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు.  ఖైదీలకు ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా న్యాయ సేవ అధికార సంస్థను సంప్రదించవచ్చు అని తెలిపారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 15100 పై ప్రచారం నిర్వహించడం జరిగింది. అనంతరము ఖైధీ లకు స్వీట్స్ పంచిపెట్టారు.గాంధీ జయంతి సందర్భంగా ఖైదీల మధ్య జరిగిన ఆటల పోటీలలో గెలుపొందిన ఖైదీలకు జడ్జి గారి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు.  ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ శివరామ చంద్ర రావు , జైలు డాక్టర్ జగదీష్, సోషల్ ఇంకు బెటర్ సెంటర్ సభ్యులు  శ్రీనివాసరావు, మధుబాబు, హనుమంతప్ప మరియు ఖైధీ లు పాల్గొన్నారు.