BREAKING
ఘనంగా తులసి దామోదర కళ్యాణం ఆసీస్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.. ఓపెనర్ల విధ్వంసంతో సిరీస్ సమం ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో వైభవ్ సూర్యవంశీ ఊచకోత.. 28 బంతుల్లోనే మెరుపు సెంచరీ కార్మికుల భద్రతకు సింగరేణి పెద్దపీట - ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కె. నిరోష కందకుర్తి నది వద్ద సంతరించుకున్న కార్తీక శోభ కపిల్స్ కిచెన్ ను ప్రారంభించిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో హర్ప్రీత్ సింగ్ భాటియా మెరుపు సెంచరీ.. యూఏఈ పోరాటం ఇలా బీజేవైఎం మండల అధ్యక్షులుగా చిట్యాల విజయ్ కుమార్ స్వర్ణ గ్రామంలో శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు భారత్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన ఆస్ట్రేలియా.. కరారా ఓవల్‌లో అత్యధిక టీ20 స్కోరు! రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఎస్‌ఐఆర్‌ పేరుతో కాలరాస్తారా? మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మా వైపు నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు.. పూర్తి సహకారం అందిస్తాం. మున్సిపల్ చైర్మన్. ఐపీఎల్ 2027కు న్యూజిలాండ్ స్టార్ పేసర్ గుడ్‌బై.. సీఎస్కే రిలీజ్ చేయగానే పీఎస్ఎల్‌తో భారీ డీల్! ఎన్డీయే కూటమి ఐక్యతతోనే గ్రామాల అభివృద్ధి శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి వేడుకలు

జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా గంధం పల్లంరాజు..: జిల్లా టీడీపీ తీర్మానం

Select Suryaa Now
జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా గంధం పల్లంరాజు..: జిల్లా టీడీపీ తీర్మానం

అమలాపురం మేజర్ న్యూస్ అమలాపురంలో బుధవారం నిర్వహించిన సెప్టెంబర్ నెల క్యాలెండర్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి  గంధం పల్లంరాజును రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా పరిషత్ జెడ్పీచైర్మన్ అభ్యర్థిగా ఎంపిక చేయాలని జిల్లా టీడీపీ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది.
​జిల్లా పార్టీ అధ్యక్షులు  గుత్తుల సాయి అధ్యక్షతన, ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు స్వగృహంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా పల్లంరాజు పేరును ఆమోదిస్తూ చేసిన తీర్మానం సమావేశంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పార్టీకి ఆయన అందిస్తున్న సేవలు, నాయకత్వ పటిమను గుర్తించి అధిష్టానం ఆయనను అభ్యర్థిగా ప్రకటించాలని జిల్లా నాయకత్వం కోరింది.
​ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్ తీర్మానంతో పాటు మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలను ఏకగ్రీవంగా ఆమోదించారు:
​ గన్నవరం నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌ను నియమించినందుకు జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు.
​ రాబోయే పురపాలక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులందరినీ భారీ మెజార్టీతో గెలిపించేలా కార్యాచరణ రూపొందించాలని, ప్రతి ఒక్కరూ విజయం కోసం శ్రమించాలని పిలుపునిచ్చారు.​ పెన్షన్ నమోదు ప్రక్రియలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛను మంజూరు చేయాలని కోరారు.
​45 రోజుల పాటు నిర్వహించిన 'డోర్ టు డోర్'  కార్యక్రమాన్ని జిల్లాలో దిగ్విజయం చేసిన నాయకులకు, కార్యకర్తలకు జిల్లా కమిటీ అభినందనలు తెలిపింది.​ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి మాట్లాడుతూ.. పార్టీ సంస్థాగత బలోపేతానికి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులను సంసిద్ధం చేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఐక్యంగా పనిచేయాలని సూచించారు.