జనసేన పార్టీలోకి గ్రీన్ టీం సభ్యులు చేరిక
-పార్టీలోకి ఆహ్వానించిన నియోజకవర్గ ఇన్చార్జి పేడాడ రామ్మోహన్ రావు
ఆమదాలవలస, నవంబర్ 16, మేజర్ న్యూస్
ఆమదాలవలస మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని జనసేన పార్టీ ఆమదాలవలస నియోజకవర్గం ఇంచార్జ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పేడాడ రామ్మోహన్ రావు తెలిపారు.ఆమదాలవలస కు చెందిన గ్రీన్ టీం వ్యవస్థాపక అధ్యక్షులు సాధు రమేష్ తన బృంద సభ్యులతో కలిసి సోమవారం జనసేన పార్టీలో చేరారు. అమదాలవలస జనసేన పార్టీ కార్యాలయంలో ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు జనసేన పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో గ్రీన్ టీం వ్యవస్థాపక అధ్యక్షులు సాధు రమేష్‌తో పాటు కింజరాపు గణేష్, సాధు కామరాజు, కింజరాపు బాలకృష్ణ, కింజరాపు లక్ష్మణరావు (మాజీ కౌన్సిలర్), బన్నా బాల భాస్కరరావు, పులగు మహేష్, బాన్న శంకర్, లావేటి పాపారావు, అల్లాడ గడ్డిరాజు, జోగి సూరి తదితరులు జనసేన పార్టీలో చేరారు.అనంతరం పేడాడ రామ్మోహన్ రావు మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని, కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేయాలని సూచించారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలని పిలుపునిచ్చారు.