జనసేన పార్టీలోకి భారీగా చేరికలు
జనసేనలోకి భారీగా చేరిన వైసీపీ నాయకులు
అవనిగడ్డ, సూర్య: కోడూరు మండలం మాచవరం గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. బుధవారం రాత్రి రెడ్రౌతు కృష్ణబాబు, కూరాకుల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు జనసేనలో చేరగా, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, యువనాయకుడు మండలి వెంకట్రామ్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
వైసీపీ నుంచి విస్సంశెట్టి గంగారావు, విస్సంశెట్టి పున్నారావు, కూరాకుల సుబ్బారావు, కూరాకుల శివరామకృష్ణ, కోట ఆదిశేషు, జరుగు రామాంజనేయులు, నల్లూరి రమేష్, కూరాకుల ఆంజనేయులు, నల్లూరి వెంకటేశ్వరరావు, కూరాకుల మధు, నల్లూరి రామాంజనేయులు, నల్లూరి నాగ రమేష్ తదితరులు జనసేనలో చేరారు. అజంతా శ్రీనివాస్ అవనిగడ్డ కృష్ణాజిల్లా