జనసేన నియోజకవర్గ నిర్వాహక్ దళ్ సభ్యునిగా గూడంశెట్టిరవి:
సిఎస్ పురం,మేజర్ న్యూస్,,స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జనసేన కనిగిరి నియోజకవర్గ నిర్వాహక్ దళ్ కమిటీని 32మంది సభ్యులతో జనసేన అధినేత,ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియమించగా నియోజకవర్గ నిర్వాహక్ దళ్ కమిటీసభ్యుడుగా మండలంలోని కోవిలంపాడు పంచాయతీ ప్రముఖులు,మండల జనసేన సీనియర్ నేత గూడంశెట్టిరవికి స్థానం కల్పించారు.జనసేన ఆవిర్భావం నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ అధిష్టానం ఆదేశాలను పాటిస్తూ మండలంలో జనసేన అభివృద్ధికి విశేషకృషి చేసిన గూడంశెట్టిరవిని కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గ నిర్వాహాక్ దళ్ సభ్యుడుగా నియమించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.ఈసందర్భంగా గూడంశెట్టిరవి మాట్లాడుతూ జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంలో స్థానికసంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషిచేస్తానని అదేవిధంగా నన్ను నియోజకవర్గ కమిటీ సభ్యునిగా నియమించినందుకు అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బాలినేని శ్రీనివాసులురెడ్డి, షేక్ రియాజ్,వరికూటినాగరాజు, ఇతర జనసేన పెద్దలకు ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలువుతున్నట్లు గూడంశెట్టిరవి అన్నారు.