జడ్పిటిసి సిరమ్మకు శుభాకాంక్షలు సందడి...
విజయనగరం, సూర్య : విజయనగరంలోని ధర్మపురిలో గల 'సిరి సహస్ర రైజింగ్ ప్యాలెస్' నాయకులు, కార్యకర్తల కోలాహలంతో సందడిగా మారింది. తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంటరీ పరిశీలకులు, ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ కుమార్తె అయిన తెర్లాం జడ్పిటిసి సిరమ్మ భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన సందర్భంగా పలువురు ప్రముఖులు, పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సిరమ్మ, ప్రదీప్ నాయుడు లను మర్యాదపూర్వకంగా బుధ వారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో పలువురు సీనియర్ నాయకులు సిరమ్మ ను, ప్రదీప్ నాయుడు లను పూలబొక్కెనలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. తనను కలిసి అభినందించిన ప్రతి ఒక్కరికీ సిరమ్మ,ప్రదీప్ నాయుడులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని , తెర్లాం మండలం అభివృద్ధికి అందరి సహకారంతో సుపరిపాలన అందిస్తానన్నారు.