జడ్పీచైర్మన్ రేసులో వైసిపినేత ముత్యాల నారాయణరెడ్డి(
మండల జడ్పిటిసి ఓసి జనరల్ అవకాశం కలిసొచ్చేనా?):సిఎస్ పురం,మేజర్ న్యూస్: స్థానికసంస్థల ఎన్నికల సందర్భంగా నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాపరిషత్ ఓసి జనరల్ కావడంతో వైసీపీ తరపున జిల్లాపరిషత్ చైర్మన్ అభ్యర్థి రేసులో మండలంలోని అయ్యలూరివారిపల్లె గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, వైసీపీ జిల్లా ప్రధానకార్యదర్శి ముత్యాల నారాయణరెడ్డి వైసిపి అధిష్టానం పరిశీలనలో ఉన్నారు. అంతేకాకుండా స్వంతమండలమైన సిఎస్ పురం జడ్పిటిసి ఓసి జనరల్ కేటాయించినందున ముత్యాల నారాయణరెడ్డి జడ్పిటిసిగా పోటీచేసి జిల్లాపరిషత్ చైర్మన్ పీఠం దక్కించుకోవాలని ఆసక్తిగా ఉన్నారు.ముత్యాలనారాయణరెడ్డి 2009వ సంవత్సరం వైసిపి ఆవిర్భావం నుండి వైసిపిలో కొనసాగుతూ అధిష్టానం ఆదేశించిన ప్రతికార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడానికి నిరంతరం కృషిచేసినట్లు అదేవిధంగా కనిగిరి నియోజకవర్గంలో వైసిపి అభివృద్ధికి కృషిచేసిన సీనియర్ నేతల్లో ముత్యాల నారాయణరెడ్డి ఉండటం విశేషం. అదేవిధంగా మండలంలోని 2021వ సంవత్సరం అయ్యలూరివారిపల్లె పంచాయతీ సర్పంచుగా ఏకగ్రీవంగా ఎన్నికైన ముత్యాల భారతి నారాయణరెడ్డి స్వంతఖర్చుతో పంచాయతీ అభివృద్ధికి ప్రజలకు మౌళిక వసతులు కల్పించడానికి ప్రత్యేకశ్రద్ద కనబరచి ఆదర్శంగా పంచాయతీని తీర్చిదిద్దారని మండలంలో అన్నివర్గాల ప్రజలతో సన్నిహితంగా ఉంటూ మండల ప్రజలకు అవసరమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పాఠశాలల అభివృద్ధికి క్రీడాపోటీలకు ఇతర సమాజసేవలకు తనవంతు సహకారాన్ని అందించిన ముత్యాల నారాయణరెడ్డి మండల ప్రజలకు సుపరిచితులు కావడం విశేషం. రానున్న స్థానికసంస్థల ఎన్నికల్లో జడ్పిటిసి ఓసి జనరల్ కావడం అదేవిధంగా జిల్లాపరిషత్ చైర్మన్ ఓసి జనరల్ కావడంతో ఆర్ధికంగా స్థిరపడిన ముత్యాలనారాయణరెడ్డి వైసిపి అభ్యర్థిగా పోటీచేయడానికి వైసిపి అధిష్టానం,స్థానిక నాయకులు సహకరించి అవకాశం కల్పిస్తే పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ముత్యాల నారాయణరెడ్డి తెలిపారు.