జామకాయలతో ప్రత్యేక అలంకర ణలో దర్శనమిచ్చిన నరసింహుడు
జామకాయలతో ప్రత్యేక అలంకర ణలో దర్శనమిచ్చిన నరసింహుడు
స్వామిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు రాక
బద్వేల్ మేజర్ న్యూస్.. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని వల్ల వారి పల్లి గ్రామంలో స్వయంభుగా వెలసియున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నందు శనివారం ఆలయ ప్రధాన అర్చకుడు ఆధ్వర్యంలో జామకాయలతో స్వామివారిని ప్రత్యేకంగాలంకరించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామి వారిని ఆ అలంకరణలో చూసేందుకు అధిక సంఖ్యలో పాల్గొని కాయ కర్పూరం సమర్పించి ప్రత్యేక పూజలు చేసి అనంతరం తీర్థప్రసాదాలు ఆరగించారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.