ఇప్పలవలస సర్పంచ్‌గా ఉడుముల సీతారత్నం ఘన విజయం
- త్రిముఖ పోటీలో 102 ఓట్ల మెజారిటీ.. నాలుగు వార్డుల్లోనూ అభ్యర్థుల గెలుపు
సీతానగరం నవంబర్ 27 మేజర్ న్యూస్: ఇప్పలవలస గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ నడుమ హోరాహోరీగా సాగాయి. త్రిముఖ పోటీలో నువ్వా నేనా అన్నట్టుగా జరిగిన ఎన్నికల్లో ఉడుముల సూర్యనారాయణ సతీమణి, కూటమి బలపరిచిన అభ్యర్థి ఉడుముల సీతారత్నం 102 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. దీంతో ఆమె ఇప్పలవలస గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అదేవిధంగా వార్డు సభ్యుల ఎన్నికల్లో 1వ వార్డు నుంచి బలగ ప్రభ, 2వ వార్డు నుంచి పెద్దింటి సుగుణ, 3వ వార్డు నుంచి శంబంగి రేగునాయుడు, 7వ వార్డు నుంచి చిటికెల లక్ష్మి విజయం సాధించారు. అనంతరం ఎన్నికల అధికారి సమక్షంలో సర్పంచ్‌గా ఉడుముల సీతారత్నం, ఉపసర్పంచ్‌గా శంబంగి రేగునాయుడు, బలగ ప్రభ ధ్రువీకరణ పత్రాలు స్వీకరించడంతో పాటు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఇప్పలవలస గ్రామ పంచాయతీలో నూతన పాలకవర్గం కొలువుదీరింది.
విజయం అనంతరం ఉడుముల సూర్యనారాయణ మాట్లాడుతూ గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తమపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని అన్నారు. కూటమి ప్రభుత్వ అండతో గ్రామాన్ని మరింత ప్రగతి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు.