ఇంటర్ కాలిజియట్ పురుషుల హాకీ పోటీలు విన్నర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల యలమంచిలి
విశాఖఎడ్యుకేషన్, సూర్య : ఆంధ్రవిశ్వవిద్యాలయం పురుషుల ఇంటర్ కాలిజియట్, యూనివర్శిటి ఎంపిక డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాలలో జరిగాయి. ఈపోటీలను ఏయూ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆచార్య ఏ పల్లవి ముఖ్యఅతిథిగా పాల్గొని బుధవారం ఉదయం హాకీ పోటీలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఏయూ ఎఫిలియేషన్ వివిధ కళాశాలల క్రీడాకారుల ఇంటర్ కాలిజియట్ యూనివర్శిటీ హాకీ జట్టు ఎంపికల్లో పాల్గుటు న్నారని ఆచార్య ఎ. పల్లవి తెలిపారు. ఈ సందర్బంగా క్రీడాకారులను అభినందించారు. అనంతరం హాకీ పోటీల విజేతలకు ఆచార్య ఎ. పల్లవి బహుమతి ప్రధానం చేసారు. ప్రధమ స్థానంలో గవర్న మెంట్ డిగ్రీ కళాశాల యలమంచిలి ప్రధమ స్థానంలో, డాక్టర్ లంకవల్లి బుల్లయ్య కళాశాల ద్వితీయ స్థానంలో, ప్రగతి కాలేజీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ తృతీయ స్థానంలో నిలిచాయి. విజేతలకు డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, విభాగం హెడ్ ఆచార్య ఏ. పల్లవి, డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ డాక్టర్ దీపక్ చౌదరి, డీన్ సోమేశ్వర్ రెడ్డి, విజేతలకు బహుమతి ప్రధానము చేసారు. ఈ కార్యక్రమం లో డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల వ్యాయామ విద్యా విభాగం హెడ్ డాక్టర్ లక్షణ్ రెడ్డి, ఏయూ వ్యాయామ విద్యా విభాగం ప్యాకల్టీ డాక్టర్ వై. శ్రీనివాసరావు, డాక్టర్ ప్రశన్న, నక్కపల్లి డిగ్రీ కళాశాల వ్యాయామ విద్యా విభాగం పీజీ దుర్గారావు, డాక్టర్ వి.ఎస్. కృష్ణాకళాశాల లెక్చరర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ వై. పోలిరెడ్డి, వివిధ కళాశాల ఫిజికల్ డైరెక్టర్లు, క్రీడాకారులు ఉన్నారు.