ఇంకొల్లు మండలంలో పోలింగ్‌కి అన్ని ఏర్పాట్లు
ఇంకొల్లు, మేజర్‌న్యూస్ :
ఇంకొల్లు మండలంలో గురువారం జరగనున్న పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎం.పి.డి.ఓ గట్టా శ్రీనివాసరావు తెలిపారు. ఇంకొల్లు మండలంలో 8 గ్రామాలల్లో గ్రామ పంచాయితి సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. 110 బూతుల్లో పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు. 370 సిబ్బంది పోలింగ్‌లో పాల్గొననున్నారు. బుధవారం సాయంత్రానికి ఆయా పోలింగ్ కేంద్రాలలో సిబ్బందిని బస్సుల్లో చేరవేశారు. గురువారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ దృష్ట్యా 200 మంది సిబ్బందిని బందోబస్తు నిమిత్తం ఏర్పాటు చేశామని ఇంకొల్లు ఎస్సై బి.వినోద్ కుమార్ తెలిపారు. 33 లొకేషన్లలో బృందాలు ఉంటాయన్నారు. 5 గ్రాఫు మొబైల్ టీం, 2 స్పెషల్ స్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత కౌంటింగ్ వద్ద కూడా భారీ బందో బస్తు ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద బారికెడ్లు, మెష్లు, సి.సి కెమెరాలు ఏర్పాటు చేశామని వినోద్ కుమార్ వివరించారు. ఇంకొల్లు మండలంలో గురువారం ఇంకొల్లు, పావులూరు, నక్కలపాలెం, నాగండ్ల, కొణికి, దుద్దుకూరు, గంగవరం, సుబ్బారెడ్డిపాలెం గ్రామాలలో పోలింగ్ జరగనుంది.
సూర్య రిపోర్టర్ : షేక్ జానిబాష, ఇంకొల్లు.