ఇందుపూరు ఎంపీటీసీ జనసేన అభ్యర్థిగా కోడూరు యమున
అల్లూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇందుపూరు ఎంపీటీసీ అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న కోడూరు యమునకు మంగళవారం పార్టీ కార్యాలయంలో బీ-ఫారం అందజేశారు. కావలి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్తలు మన్నెమాల సుకుమార్ రెడ్డి, సమ్మను వెంకటసుబ్బయ్య యమునకు బీ-ఫారం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పార్టీ అభ్యర్థి కోడూరు యమునను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎంపీటీసీ ఎన్నికల్లో జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్పై ఓటు వేసి యమునకు మద్దతు తెలపాలని కోరారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.