BREAKING
అమ్మవారి అలంకరణకు పట్టు చీరల అందజేత విజయవాడ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవాన్ని చాటే మహోత్సవాలకు ఆహ్వానం - దసరా శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్‌–2.0కు మంత్రులకు ఎంపీ కేశినేని చిన్ని ఆహ్వానం మృతి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.లక్ష సాయం మహిళలకు కుట్టుమిషన్ల అందజేత ఏడు కుటుంబాలకు రూ.3.20 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఓటర్ల జాబితాపై మరోసారి ఇంటింటి పరిశీలన బాలల స్నేహపూర్వక జిల్లాగా ఎన్టీఆర్ జిల్లా మీ ఆహార సేవకు అమ్మ ఆశీస్సులుండాలి.. : ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ మహోత్సవాలకు మహా సన్నాహాలు... - మూడు ప్ర‌ధాన ఉత్స‌వాల‌కు ప‌టిష్ట ఏర్పాట్లు గుంతలు లేని నగరంగా విజయవాడను తీర్చిదిద్దాలి : కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడలో ఐదు అర్బన్ క్రెచ్‌లు - రూ.50 లక్షలతో ఏర్పాటు.. రూ.45 లక్షలు డోనర్ సంస్థ సహకారం వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి త్వరలో చర్యలు - 22 రోజుల సహాయ నిరాకరణపై రెవెన్యూ మంత్రి హామీ సిద్ధార్థ ఫ్లైఓవర్‌పై చీకట్లు.. ప్రమాదాలకు ఆహ్వానం కృష్ణా వర్సిటీ మహిళా చెస్ ఛాంపియన్షిప్‌లో కేబీఎన్ కళాశాలకు విజయం మోదీ 25 ఏళ్ల ప్రజా సేవకు గుర్తుగా తాడిగడపలో సేవా జ్యోతి యాత్ర - ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ

హెల్త్ డిప్యూటీ డైరెక్టర్ తనిఖీలు

Select Suryaa Now
హెల్త్ డిప్యూటీ డైరెక్టర్ తనిఖీలు

                         నేటి దినపత్రిక సూర్య బ్యూరో (రాజమహేంద్రవరం ) ఆంధ్రప్రదేశ్ స్టేట్  డైరెక్టర్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్,  డిప్యూటీ డైరెక్టర్, వైటల్  స్టాటిస్టిక్స్ శ్రీ యం. శ్రీనివాసరావు  మరియు రీజనల్ డైరెక్టర్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్, జోన్ 2 రాజమహేంద్రవరం, డిప్యూటీ డైరెక్టర్, వైటల్  స్టాటిస్టిక్స్, కే శ్రీనివాసరావు  రాజమహేంద్రవరం నగరపాలక కార్యాలయంలో బుధవారంతనిఖీలు నిర్వహించారు. జనన మరణ విభాగమునందలి రికార్డ్స్ 

తనిఖీ చేసి, హెల్త్  అసిస్టెంట్లకు  సమావేశం నిర్వహించారు. రిజిస్ట్రేషన్ చేసిన జనన మరియు మరణ రిపోర్ట్స్ పరిశీలన చేసారు. ఎటువంటి జాప్యం లేకుండా జనన మరియు మరణ నమోదులు చేసి  రిజిస్ట్రేషన్ చేయవలసినదిగా ఆదేశించారు 2026 వ సంవత్సరంలో వచ్చిన జనన - మరణ రూల్స్ ప్రకారం ప్రతి ఒక్కరు పనిచేయాలని తగుచూచనలు ఇచ్చినారు. ఈ మీటింగ్ నందు ఎం.హెచ్.ఓ. డా.వినూత్న, డిస్ట్రిక్ట్  స్టాటిస్టికల్ ఆఫీసర్ శ్రీ కుమార స్వామి  డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ శ్రీ యమ్. యన్. సుదీర్ బాబు మరియు హెల్త్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (సిఆర్ సి పోర్టల్ ) నందలి రిజిస్త్రేషన్ లను మరియు ప్రైవేట్ హాస్పిటల్స్  నుండి వచ్చే జనన మరియు మరణ నమోదులు   పరిశీలించారు. ప్రైవేట్ హాస్పిటల్స్ మాగ్న మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ మరియు కోస్టల్ కార్డియాక్ అండ్ మెటర్నిటీ హాస్పిటల్ లను సందర్శించి  జనన రికార్డులను పరిశీలించి డాక్టర్లకు  తగు సూచనలు చేసారు.