BREAKING
రాజస్థాన్ పోలీసు దళంలోకి 438 మంది మహిళా కానిస్టేబుళ్లు.. దీక్షాంత్ పరేడ్‌లో కర్తవ్య ప్రమాణం శీతాకాల విమాన సర్వీసుల వేళ నవీ ముంబై ఎయిర్‌‌పోర్ట్ బహుళ రవాణా అనుసంధానం విస్తరణ కోనసీమ పోలీస్ శాఖలో నూతన డాగ్ కెన్నెల్ ప్రారంభం.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధం కావాలి :జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్.. అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి.. కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్.. నో యువర్ లీడర్’ సమనస జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని భవ్య శ్రీ.. పరిమళ ప్రసాదం కొరత తీర్చేందుకు మెగా ప్రాజెక్టు ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యేక సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి..జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. 17వ డివిజన్‌లో అదరగొట్టిన ఫ్లాష్ మాబ్స్.. - విజయవాడ ఉత్సవ్ 2.0కు విస్తృత ప్రచారం ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తిస్థాయిలో పరిష్కరించాలి సాంప్రదాయ విలువలను భావితరాలకు అందించాలి : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ దసరా విశేష సేవల ఆన్‌లైన్ టికెట్లు విడుదల దసరా ఏర్పాట్లపై దేవాదాయ కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన పేద కుటుంబాలకు అండగా నిలుస్తాం.. సమాజ సేవకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి బీసీలకు న్యాయం జరిగేలా రిజర్వేషన్లు

హత్యాయత్నం కేసులో నిందితుడికి ఏడేళ్లు జైలు

Select Suryaa Now
హత్యాయత్నం కేసులో నిందితుడికి ఏడేళ్లు జైలు

 

గోపాలపురం, మేజర్ న్యూస్ అక్టోబర్ 05:

రెండు వేర్వేరు హత్యాయత్నం కేసుల్లో నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.6 వేల జరిమానా విధిస్తూ కొవ్వూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి గంధం వెంకట లక్ష్మీ సరస్వతి సోమవారం తీర్పు వెలువరించినట్లు గోపాలపురం ఎస్సై వి. సుబ్రహ్మణ్యం తెలిపారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గోపాలపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని హుకుంపేటలో 2021 మే 30న స్థల వివాదం కారణంగా గేరా వీర వెంకట సత్యనారాయణ అలియాస్ జగన్ అనే వ్యక్తి.. నాయుడు వీర కృష్ణపై గునపంతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అదే రోజు కొద్దిసేపటి తర్వాత తన కోడలి ఉద్యోగానికి సంబంధించిన పాత గొడవల కారణంగా మునిశెట్టి సాయి శ్రీ కళ్యాణ్, మునిశెట్టి లక్ష్మీలపై కూడా కత్తితో దాడి చేసి గాయపరిచాడని ఎస్సై తెలిపారు.

ఈ ఘటనలపై గోపాలపురం పోలీస్‌స్టేషన్‌లో రెండు హత్యాయత్నం కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. నిందితుడిని 2021 జూన్ 10న అరెస్టు చేసి, అనంతరం కోర్టులో చార్జిషీట్లు దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. కేసుల విచారణలో కోర్టు కానిస్టేబుల్ ఎస్. భాను సమన్వయంతో ప్రాసిక్యూషన్ తరఫున జిల్లా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మర్రి వెంకటేష్ వాదనలు వినిపించారని తెలిపారు.

సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడిని నేరస్థుడిగా నిర్ధారించినట్లు ఎస్సై తెలిపారు. క్రైమ్ నంబర్ 149/2021లో ఏడేళ్ల జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా, క్రైమ్ నంబర్ 150/2021లో ఏడేళ్ల జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా కోర్టు విధించిందన్నారు. రెండు శిక్షలు ఏకకాలంలో అమలు అయ్యేలా కోర్టు తీర్పు ఇచ్చిందని వివరించారు.

కేసుల దర్యాప్తు, ప్రాసిక్యూషన్‌కు సహకరించిన గోపాలపురం ఎస్సై వి. సుబ్రహ్మణ్యం, కోర్టు కానిస్టేబుల్ ఎస్.భాను, కానిస్టేబుల్ బి. రంగారావులను జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ అభినందించినట్లు ఎస్సై తెలిపారు.