గుర్ల లోరెండో రోజు 51 నామినేషన్లు దాఖలు
గుర్ల, సూర్య : గుర్ల లోరెండో రోజుఎన్నికల నామినేషన్ల ప్రక్రియ గురువారం సాఫీగా సాగింది.ఎన్నికల నామినేషన్ గడువు ఒక్కరోజే ఉండడం తో అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్ పత్రాలను సమర్పించారు.గురువారం ఒక్కరోజే 51 నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి ఆశయ్య వెల్లడించారు.సాయంత్రం 6గంటలవరకు నామినేషన్లు పర్వం కొనసాగింది.పార్టీల వారీగా ఎంపిటిసి నామినేషన్లు దాఖలు కబడ్డాయి.టీడీపీ 24 మంది, వైసీపీ 22 మంది జనసేన3 మంది, బీజేపీ నుండి 2 నామినేషన్ల నామినేషన్లు దాఖలు చేసారు నామినేషన్ వేయడానికి ఒక్కరోజే ఉండడంతో రెండవ రోజున ఎక్కువ నామినేషన్లు దాఖలు కబడ్డాయి.దీంతో కేంద్రాల ప్రధాన పార్టీల అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ధమర్సింగి, గూడెం, గరికవలస, గుర్ల,తదితరు గ్రామాల నుండి రెండవ రోజు నామినేషన్ పర్వం ప్రశాంతంగా సాగింది.
రిపోర్టర్ : రాము నాయుడు, గుర్ల, విజయనగరం జిల్లా.