గుమ్మగట్ట మండలంలో నామినేషన్ల పర్వం ముగిసింది!!
గుమ్మగట్ట మేజర్ న్యూస్:
గుమ్మగట్ట మండలంలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సోమవారం సాయంత్రంతో ముగిసింది. మూడు రోజుల పాటు జరిగిన నామినేషన్లలో మండల వ్యాప్తంగా భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి,మండలంలోని 15 గ్రామ పంచాయతీలకు గాను *సర్పంచ్ స్థానాలకు మొత్తం 142 నామినేషన్లు*, *వార్డు సభ్యుల స్థానాలకు మొత్తం 302 నామినేషన్లు* దాఖలైనట్లు అధికారులు తెలిపారు,చివరి రోజైన సోమవారం ఒక్కరోజే సర్పంచ్ కు 82, వార్డు సభ్యులకు 204 నామినేషన్లు దాఖలు కావడం విశేషం.
పంచాయతీల వారీగా నామినేషన్లు:
గుమ్మగట్ట:సర్పంచ్ - 20, వార్డు - 11
కె.పి.దొడ్డి: సర్పంచ్ - 9, వార్డు - 29
తాళకేర: సర్పంచ్ - 8, వార్డు - 27
సిరిగే దొడ్డి: సర్పంచ్ - 5, వార్డు - 25
గోనభావి:సర్పంచ్ - 7, వార్డు - 24
రంగసముద్రం: సర్పంచ్ - 10, వార్డు - 22
నేత్రపల్లి:సర్పంచ్ - 6, వార్డు - 22
75 వీరాపురం: సర్పంచ్ - 7, వార్డు - 22
బెలొడు: సర్పంచ్ - 9, వార్డు - 20
భూపసముద్రం:సర్పంచ్ - 10, వార్డు - 20
గలగల:సర్పంచ్ - 9, వార్డు - 19
కలగోడు: సర్పంచ్ - 12, వార్డు - 17
పులకుంట: సర్పంచ్ - 12, వార్డు - 16
మారంపల్లి: సర్పంచ్ - 9, వార్డు - 16
గొల్లపల్లి:సర్పంచ్ - 9, వార్డు - 12
గుమ్మగట్టలో సర్పంచ్ కు అత్యధికంగా 20 నామినేషన్లు దాఖలు కాగా, కె.పి.దొడ్డిలో వార్డు సభ్యులకు అత్యధికంగా 29 నామినేషన్లు దాఖలయ్యాయి,నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ అనంతరం బరిలో నిలిచే అభ్యర్థులపై స్పష్టత రానుంది. దీంతో మండలంలో ఎన్నికల వేడి మరింత పెరిగిందని ఎంపీడీవో బి జయ రాములు తెలిపారు…
సూర్య ప్రతినిధి: పెన్నయ్య గుమ్మగట్ట మండలం రిపోర్టర్