BREAKING
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ - విద్యార్థి విద్యాసంస్థల అధ్యర్యంలో బతుకమ్మ సంబురాలు స్టార్ డైరెక్టర్ వివి వినాయక్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పెషల్ బర్త్ డే విషెస్! చిక్రం శ్రీనివాస్ కుటుంబానికి గ్రామస్థుల ఆర్థిక సహాయం జనగామ జిల్లా ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ గా గోసంగి కిషన్ నియామకం ఉన్నత పాఠశాలకు క్రీడా పరికారలు ఏర్పుమల్లలో ఘనంగా బతుకమ్మ సంబరాలు రహదారిని కమ్మేసిన ముళ్ళ పొదలు వేలాడుతున్న చెట్టు కొమ్మ తొలగింపు.. స్పందించిన ఉట్నూర్ సర్పంచ్ స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై రేపు కేబినెట్ లో చర్చ సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు 986(1)ఏ సర్వే నంబర్ భూముల సమస్యకు పరిష్కారం.. 100 కుటుంబాలకు ఊరట! రైతుల కష్టాలు చూసి చలించిన మాతృహృదయం.. సొంత ఖర్చులతో డొంక దారి బాగు చేసిన పోకల శ్రీనివాసరావు అశ్వారావుపేటలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం* మసీదు సమీపంలో మద్యం దుకాణం వద్దు.. స్థానికుల నిరసన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఘన స్వాగతం

గుండె ఆరోగ్యానికి ఉచిత వైద్య శిబిరం.

Select Suryaa Now
గుండె ఆరోగ్యానికి ఉచిత వైద్య శిబిరం.

గుండె ఆరోగ్యానికి ఉచిత వైద్య శిబిరం

కళ్యాణదుర్గం టౌన్ ప్రతినిధి రంగస్వామి :-

 

ప్రజలకు ఆరోగ్య సేవలను చేరువ చేయడం, గుండె సంబంధిత వ్యాధులను ముందుగానే గుర్తించి తగిన వైద్య సలహాలు పొందేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా ఇన్ఫినిటీ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్టోబర్ 10వ తేదీ శనివారం ఉచిత గుండె వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. కళ్యాణదుర్గంలోని ఇన్ఫినిటీ ఛారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు శిబిరం ప్రారంభం కానుందని ట్రస్ట్ చైర్మన్ బద్దేనాయక్, ట్రస్ట్ సభ్యులు, మార్క్ హాస్పిటల్ పీఆర్వో రాఘవేంద్ర తెలిపారు. ఈ శిబిరంలో ఈసీజీ, 2డీ ఎకో, రక్తపోటు (బీపీ), రక్తంలో చక్కెర స్థాయుల (షుగర్) పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గడం వంటి కారణాలతో గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని, ఎలాంటి అనారోగ్య లక్షణాలున్నా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు, బీపీ, మధుమేహం ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కుటుంబ సభ్యులు కూడా తమ ఇళ్లలోని వృద్ధులను, ఆరోగ్య సమస్యలున్న వారిని వైద్య శిబిరానికి తీసుకువచ్చి పరీక్షలు చేయించేందుకు ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా నిర్వహిస్తున్న ఈ శిబిరం ద్వారా అవసరమైన ప్రాథమిక పరీక్షలు చేయించుకునే అవకాశం లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు. పరీక్షల్లో ఏవైనా సమస్యలు గుర్తించినట్లయితే వైద్యుల సూచనల మేరకు తదుపరి పరీక్షలు, చికిత్స తీసుకోవాలని సూచించారు. కళ్యాణదుర్గం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా శిబిరానికి హాజరై ఉచిత వైద్య సేవలను వినియోగించుకోవాలని ట్రస్ట్ చైర్మన్ బద్దేనాయక్, సభ్యులు, మార్క్ హాస్పిటల్ పీఆర్వో రాఘవేంద్ర కోరారు.