BREAKING
ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేని అర్హులైన ఓటర్లకు మరో అవకాశం-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆనందపురం నూతన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలకు ఎమ్మెల్యే గంటా ఘన సత్కారం బ్రహ్మలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు దంపతులు* ఎస్.రాయవరం మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సోమిరెడ్డి లక్ష్మి నామినేషన్! మాడుగుల జడ్పీటీసీ సభ్యునిగా పుప్పాల లక్ష్మి నారాయణ ప్రమాణ స్వీకారం గోవింద నామస్మరణతో మార్మోగిన ఎస్.రాయవరం! మాకవరపాలెం జడ్పీటీసీగా అల్లు రామనాయుడు ప్రమాణ స్వీకారం క్రీడల్లో పాల్గొనడం వలన మంచి డైరెక్టర్ వ్యాయామం, అభినందించిన ఏ యూ డైరెక్టర్ అఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆచార్య ఎ. పల్లవి పెనుగొల్లులో చలో ఢిల్లీ పోస్టర్ విడుదల! గెడ్డపాలెంలో వైఎస్సార్‌సీపీ సత్తా చాటిన పీవీఆర్! కోనసీమ జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్‌గా గొల్లపల్లి అమూల్య.. హోంమంత్రి అనిత సహకారంతో అభివృద్ధి చేస్తా! కొరుప్రోలు జడ్పీ హైస్కూల్లో ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు! ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద పెద్దేరు జలాశయంలో చేప పిల్లల విడుదల కనకమహాలక్ష్మి మార్గశిర ఉత్సవాలకు శ్రీకారం

గ్రంథాలయాలే విజ్ఞాన భాండాగారాలు -ముగింపు వేడుకలలో చైర్మన్ డాక్టర్ గురువారెడ్డి -విజేతలకు ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందజేత

Select Suryaa Now
గ్రంథాలయాలే విజ్ఞాన భాండాగారాలు -ముగింపు వేడుకలలో చైర్మన్ డాక్టర్ గురువారెడ్డి   -విజేతలకు ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందజేత

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : గ్రంథాలయాలే విజ్ఞాన భాండాగారాలని, సరస్వతి దేవి నిలయాలైన గ్రంథాలయాల ద్వారానే విద్యార్థులు మేధాశక్తిని పెంచుకోవాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రెడ్డివారి గురవారెడ్డి పిలుపునిచ్చారు. ఈనెల 14వ తేదీ నుంచి ప్రారంభమైన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శుక్రవారం తిరుపతిలోని ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో ముగింపు వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఏడు రోజుల పాటు నిర్వహించిన వారోత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. విద్యార్థి దశ నుంచే పుస్తక పఠనం వైపు మొగ్గు చూపాలని, గ్రంథాలయానికి రీడర్లు, విద్యార్థులు ఎక్కువ మంది వచ్చే విధంగా ప్రచారం కల్పించేందుకే ఈ వారోత్సవాలు నిర్వహించామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో గ్రంథాలయాల అభివృద్ధి లక్ష్యంతో పని చేస్తోందన్నారు. గ్రంథాలయాల్లో పుస్తకాలను వినియోగించుకొని మేధాశక్తిని పెంచుకొని మంచి పౌరులుగా తీర్చిదిద్దబడి సమాజానికి ఉపయోగపడాలని ఆకాంక్షించారు. అనంతరం నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం, డ్రాయింగ్ తదితర పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థినులకు ప్రశంసా పత్రాలు, మెమెంటోలు, మెడల్స్, పుస్తకాలు, పెన్నులు అందజేశారు. వారోత్సవాలకు సంబంధించిన సర్టిఫికెట్లు, మెమెంటోలకు కేవీఆర్ జ్యువెలర్స్ యజమాని కేవీ నారాయణమూర్తి విరాళంగా అందజేశారు. నడ్డి నారాయణ, డాక్టర్ మునిలక్ష్మి, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ గుప్తా, సీనియర్ లైబ్రేరియన్ నటరాజ నాయుడు, రిటైర్డ్ ప్రొఫెసర్ గోపాల్, ప్రాంతీయ గ్రంథాలయ అధికారి ధనంజయులు, సోము ఉమాపతి, పెద్ద ఎత్తున విద్యార్థినులు పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్